కిరాతకం :కిడ్నాప్ చేసి, గ్యాంగ్ రేప్ చేశారు

ఇంటి బయట నిల్చొని ఉన్న విధ్యార్థిని కిడ్నాప్ చేసి ముగ్గురు విధ్యార్థులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

బ్రహ్మపురం : పదో తరగతి విధ్యార్థిని ని కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకొంది.

ఒడిశా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లా బలిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది.ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టుచేశారు.

గత ఏడాది డిసెంబర్ 22వ, తేదిన రాత్రి ఏడుగంటల సమయంలో ఇంటి బయట నిల్చొనిఉన్న పదోతరగతి విధ్యార్థిని ద్విచక్ర వాహనం పై వచ్చిన ఇద్దరు యువకులు ఆమెను అపహరించి వెళ్ళారు. గ్రామ శివారులో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారు.

a 15 year old girl gang raped by three students

కారులో ఆ విధ్యార్థినిని భగముండ అటవీ ప్రాంతానికి తీసుకెళ్ళారు. ముగ్గురు విధ్యార్థులు ఆ విధ్యార్థినిపై అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన తర్వాత విద్యార్థినిని కొట్టి రోడ్డు పక్కన పడేసి వెళ్ళారు.

అదే దారిగుండా వెళ్ళే వాళ్ళు బాలికను ఆసుపత్రిలో చేర్చారు. తీవ్రంగా గాయపడిన ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకొంటుంది. పోలీసులకు బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదుచేశారు. పోలీసులు కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+