కారులో విద్యార్థిని మీద అత్యాచారం
బెంగళూరు: స్కూల్ నుండి ఇంటికి వెళుతున్న బాలిక మీద కామాంధుడు అత్యాచారం చేసిన సంఘటన కర్ణాటకలోని కుందాపుర సమీపంలో జరిగింది. బెంగళూరు నగరంలోని హెబ్బాళలోని టాటా నగరలో నివాసం ఉంటున్న తరీన్ అబ్రం (34) అనే కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు.
ఇతని మీద నిర్బయ చట్టంతో పాటు పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. తరీన్ కుందాపుర సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. కంబకోణే గ్రామంలో నివాసం ఉంటున్న 15 సంవత్సరాల బాలిక ఖంబదకోణేలోని స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నది.
సాయంత్రం 4.30 గంటలకు స్కూల్ వదలడంతో ఇంటికి నడిచి బయలుదేరింది. అదే సమయంలో తరీన్ కారులో వెళుతున్నాడు. గ్రామం సమీపంలోని నిర్జనప్రదేశంలో ఒంటరిగా వెళుతున్న బాలికను బలవంతంగా కారులోకి లాక్కున్నాడు.

తరువాత బాలిక మీద అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వెయ్యడంతో అటు వైపు వెళుతున్న వారు విషయం గుర్తించారు. గ్రామస్తులు పట్టుకుంటారని భయపడిన తరీన్ కారు అక్కడ వదిలి కాలికి బుద్ది చెప్పాడు. విషయం తెలుసుకున్న పోలీసులు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ లకు సమాచారం ఇచ్చారు.
బస్సులో బెంగళూరు వెళ్లడానికి తరీన్ ప్రయత్నించాడు. బ్రహ్మావర లో బస్సులో వెళుతున్న తరీన్ ను స్థానిక పోలీసులు పట్టుకున్నారు. తరువాత బైందూరు పోలీసులకు కామాంధుడిని అప్పగించారు. బాలికను వైద్య పరీక్షలకు తరలించామని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications