బిజెపి ఆఫీస్‌లో ఘోరం: బాలికపై యువకుడి లైంగిక దాడి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని బెహ్లా మండల బీజేపీ కార్యాలయంలో ఘోరం జరిగింది. ఓ బాలికపై లైంగిక దాడి జరిగింది. బెహ్లాలోని ఓ 17 ఏళ్ల యువకుడు ఐదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన బెహ్లా మండల బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు బెహ్లాలో ఐదేళ్ల బాలిక అదృశ్యమైంది. బాలిక అదృశ్యమైన విషయాన్ని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా స్థానికంగా ఉన్న బీజేపీ ఆఫీస్‌లో బాలిక కనిపించింది. కార్యాలయం తెరిచి చూసే సరికి బాలిక ఏడుస్తూ ఉంది.

A 17-year-old youth was arrested for allegedly sexually assaulted

బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక అత్యాచారానికి గురైనట్లు వైద్యులు తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు, బీజేపీ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్థానికులు బీజేపీ కార్యాలయంపై దాడి చేసేందుకు యత్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+