ఆటోలో యువతిపై లైంగిక దాడికి దిగిన డ్రైవర్లు

బెంగళూరు: బెంగళూరు మహానగరంలో మహిళలకు కొందరు డ్రైవర్ల వలన రక్షణ లేకుండా పోతున్నదని మరో సారి వెలుగు చూసింది. ఒంటరిగా ఇంటికి వెళుతున్న యువతి మీద ఆటో డ్రైవర్లు లైంగిక దాడికి పాల్పడ్డారు.

అదే సమయంలో ఇద్దరు యువకులు బైక్ లో అటు వైపు వెళ్లడంతో ఆమె చాకచక్యంగా తప్పించుకుంది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు కేసు నమోదు చేసి ఆటో డ్రైవర్ల కోసం గాలిస్తున్నారు.

గుజరాత్ కు చెందిన 23 సంవత్సరాల యువతి బెంగళూరు చేరుకుని జేసీ నగరలో నివాసం ఉంటున్నది. ఈమె కమర్షియల్ స్ట్రీట్ లోని ఓ షో రూంలో ఉద్యోగం చేసింది. గత నవంబర్ 8వ తేదిన ఉద్యోగం నిలిపి వేసింది. అప్పటి నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నది.

మంగళవారం రాత్రి స్నేహితుడితో కలిసి ఎంజీ రోడ్డులో షాపింగ్ చేసింది. తరువాత సమీపంలోని హోటల్ లో భోజనం చేశారు. రాత్రి 11.30 గంటల సమయంలో ఆమె స్నేహితుడు ఆటో నిలిపాడు. ఈ యువతిని జేసీ నగరలో డ్రాప్ చెయ్యాలని ఆమె స్నేహితుడు ఆటో డ్రైవర్ కు చెప్పాడు.

A 23-year-old woman was allegedly molested by an autorickshaw driver

డ్రైవర్ సరే అని ఆమెను తీసుకుని బయలుదేరాడు. మార్గం మద్యలో మరో డ్రైవర్ కు ఫోన్ చేసి పిలిపించుకున్నాడు. అతనిని డ్రైవర్ సీటు పక్కన కుర్చోపెట్టుకున్నాడు. మార్గం మద్యలో నంది దుర్గా రోడ్డులో ఆటో నిలిపి యువతి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు.

ఆ సమయంలో బైక్ లో వెలుతున్న ఇద్దరు యువకులు యువతి కేకలు వేస్తున్న విషయం గుర్తించి బైక్ నిలిపారు. అదే సందర్బంలో యువతి తప్పించుకుని అక్కడి నుంచి పరారైయ్యింది. ఆటో డ్రైవర్లు యువకులకు మాయమాటలు చెప్పి జారుకున్నారు.

బుధవారం యువతి కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆటో నెంబర్ లేకపోవడంతో పోలీసులు ఇబ్బందిపడ్డారు. సీసీ కెమెరాలు పరిశీలించి యువతి మీద లైంగిక దాడికి పాల్పడిన డ్రైవర్ల కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+