లైంగిక కోరిక తీర్చిన విదేశీ విద్యార్థిని: 18 సార్లు పొడిచి చంపేశాడు
లైంగిక కోరిక తీర్చుకున్న తరువాత ఐదు వేల నగదు విషయంలో గొడవపడిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇషాన్ (27) అనే యువకుడు ఉగాండా దేశానికి చెందిన ఫ్లోరెన్స్ నకయాకి (24) అనే విద్యార్థిని 18 సార్లు కత్తితో పొడిచి.
బెంగళూరు: లైంగిక కోరిక తీర్చుకున్న తరువాత నగదు విషయంలో గొడవపడిన యువకుడు విదేశీ విద్యార్థిని దారుణంగా హత్య చేసిన ఘటన బెంగళూరు నగరంలో జరిగింది. ఉగాండా విద్యార్థిని ఫ్లోరెన్స్ నకయాకి (24) అనే విద్యార్థిని హత్యకు గురైందని బెంగళూరులోని కొత్తనూరు పోలీసులు తెలిపారు.
ఫ్లోరెన్స్ ను హత్య చేసిన హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఇషాన్ సూద్ (27) అనే యువకుడిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఉగాండా నుంచి బెంగళూరు చేరుకున్న ఫ్లోరెన్స్ కొత్తనూరులోని తిమ్మేగౌడ లేఔట్ లో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది.

బుధవారం రాత్రి ఎంజీ రోడ్డు సమీపంలోని బ్రిగేడ్ రోడ్డులోని బార్ లో ఫ్లోరెన్స్, ఇషాన్ మద్యం సేవించారు. తరువాత లైంగిక కోరిక తీర్చుకోవాలని ఇద్దరు అనుకున్నారు. ఫ్లోరెన్స్ స్వయంగా క్యాబ్ బుక్ చేసి రాత్రి 11.30 గంటల సమయంలో ఇషాన్ ను తన ఇంటికి పిలుచుకుని వెళ్లింది.
గురువారం ఉదయం వరకు ఇద్దరూ లైంగిక కోరిక తీర్చుకున్నారు. తరువాత ఇషాన్ లైంగిక కోరిక తీర్చినందుకు ఒప్పందం ప్రకారం రూ. 5 వేలు ఫ్లోరెన్స్ కు ఇచ్చాడు. అయితే తనకు రూ. 10 వేలు ఇవ్వాలని ఫ్లోరెన్స్ డిమాండ్ చేసింది. తన దగ్గర అంత డబ్బు లేదని ఇషాన్ చెప్పాడు.
చివరికి ఇషాన్ మనీ పర్స్ తీసుకున్న ఫ్లోరెన్స్ అందులో నగదు లేకపోవడంతో రెచ్చిపోయింది. వంట గదిలో ఉన్న కత్తి తీసుకుని ఇషాన్ చేతి మీద దాడి చేసింది. చేతికి గాయాలు కావడంతో ఇషాన్ సహనం కోల్పోయాడు. ఫ్లోరెన్స్ చేతిలోని కత్తి లాక్కోని ఆమె కడుపు, చాతి, మర్మాంగం తదితర ప్రాంతాల్లో 18 సార్లు దారుణంగా పొడిచాడు.
ఫ్లోరెన్స్ కేకలు వేయడంతో పక్కింటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తీవ్రగాయాలు కావడంతో ఫ్లోరెన్స్ అక్కడికక్కడే మరణించింది. పోలీసులు వచ్చి చూడగా ఇషాన్ ఫ్లోరెన్స్ శవం పక్కనే కుర్చుని ఉన్నాడు. ఇషాన్ చేతికి గాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేసి తరువాత అరెస్టు చేశారు.
ఫ్లోరెన్స్ ఇంటి దగ్గరకు చేరుకున్న ఉగాండా దేశానికి చెందిన విద్యార్థులు అక్కడికి వెళ్లి పోలీసులపై దాడి చేశారు. ఫ్లోరెన్స్ శవాన్ని అక్కడి నుంచి తరలించకుండా అడ్డుకున్నారు. 2016 ఫిబ్రవరిలో ఫ్లోరెన్స్ బెంగళూరు వచ్చింది. 2016 ఆగస్టుకు ఆమె వీసా గడువు పూర్తి అయ్యింది.
అయితే 2017 ఫిబ్రవరి 15 వరకు వీసా గడుపు పొడగించుకున్న ఫ్లోరెన్స్ రెండు వారాల్లో ఉగాండా వెళ్లడానికి సిద్దం అయ్యింది. ఫ్లోరెన్స్ ఓ ప్రయివేట్ కాలేజ్ లో బీబీఎం చదువుతున్నట్లు ఐడీ కార్డు చిక్కిందని పోలీసులు అన్నారు. అయితే ఆ కాలేజ్ యాజమాన్యం తాము ఫ్లోరెన్స్ కు ఎలాంటి గుర్తింపు కార్డు ఇవ్వలేదని చెప్పారని డీసీపీ హర్షా అన్నారు.
ఫ్లోరెన్స్ వేశ్య అని తనకు తెలీదని ఇషాన్ పోలీసులకు చెప్పాడు. 2017 నూతన సంవత్సర వేడుకల సందర్బంగా ఎంజీ రోడ్డులో ఫ్లోరెన్స్ పరిచయం అయ్యిందని, అప్పటి నుంచి ఇద్దరూ ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని ఇషాన్ పోలీసులకు చెప్పాడు. ఎంటెక్ పూర్తి చేసిన ఇషాన్ ఉద్యోగం కోసం బెంగళూరు వచ్చి స్నేహితుడి గదిలో ఉంటున్నాడు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications