బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు టు జైపూర్: 32 వేల అడుగుల ఎత్తులో.. కళ్లు తెరిచిన పసికందు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు-జైపూర్ ఇండిగో విమానంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. విమాన సిబ్బంది సహకారంతో తోటి ప్రయాణికురాలైన ఓ డాక్టర్ ఆమెకు పురుడు పోశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఇండిగో విమానయాన సంస్థ యాజమాన్యం, జైపూర్ విమానాశ్రయం అధికారులు వెల్లడించారు. భూమికి 32 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతోన్న సమయంలో ఆ బిడ్డ జన్మించినట్లు తెలిపారు.

బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి సుమారు 180 మంది ప్రయాణికులతో ఈ తెల్లవారు జామున ఇండిగో విమానం 6ఈ-469 జైపూర్‌కు టేకాఫ్ తీసుకుంది. విమానం మార్గమధ్యలో ఉన్న సమయంలో గర్భిణీకి నొప్పులు ఆరంభం అయ్యాయి. జైపూర్‌కు వెళ్లి, ఆసుపత్రిలో చేరేంత సమయం లేకపోవడంతో.. విమాన సిబ్బంది ప్రయాణికులకు ఈ విషయాన్ని తెలిపారు. వారిలో సుబాహనా నజీర్ అనే డాక్టర్ ప్రసవం చేయడానికి ముందుకొచ్చారు. సిబ్బంది సహకారంతో ఆమెకు పురుడు పోశారు.

 A baby girl was born on board an IndiGo flight from Bengaluru to Jaipur

ఈ విషయాన్ని జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులకు తెలియజేశారు. దీనితో వారు- విమానం ల్యాండ్ అయ్యే సమయానికి రన్ వే మీద అంబులెన్స్‌, డాక్టర్లను సిద్ధం చేసి ఉంచారు. విమానం దిగిన వెంటనే- ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. వైద్య పరీక్షలను నిర్వహించారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. తమ విమానంలో ఓ చిన్నారి కళ్లు తెరవడం పట్ల ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఆ మహిళకు గిఫ్ట్ కార్డ్ ఇచ్చారు.

English summary
A baby girl was born on board an IndiGo flight from Bengaluru to Jaipur. Baby was delivered with the help of crew assisted by a doctor on board. Jaipur airport was immediately informed to arrange for a doctor and an ambulance on arrival.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X