వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో బాంబు కలకలం

|
Google Oneindia TeluguNews

కోల్కతా: ఫలక్ నుమా ఎక్స్ ప్రైస్ రైలుకు పెద్ద ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని దుండగులు ఆ రైలులో బాంబు పెట్టి పేల్చడానికి ప్రయత్నించారు. అయితే అధికారులు సరైన సమయంలో బాంబును గుర్తించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది.

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని హౌరా రైల్వేస్టేషన్ లో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు నిలిపారు. ఆ రైలులోని బోగిలో ఓ సిలిండర్ అనుమానాస్పదంగా కనపడింది. విషయం గుర్తించిన ప్రయాణికులు రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు.

A bomb has been recovered from the Falaknuma Express Howrah Railway Station

పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అది సిలిండర్ కాదు బాంబు అని గుర్తించారు. వెంటనే బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కు సమాచారం అందించారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బాంబును నిర్జనప్రదేశంలోకి తీసుకు వెళ్లి నిర్వీర్యం చేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పడంతో స్టేషన్ లో ఉన్న ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. ఆ బాంబును ఎక్కడి నుంచి తీసుకు వచ్చి పెట్టారు అని ఆరా తియ్యడానికి ఫలక్ నుమా ప్రయాణించిన అన్ని రైల్వే స్టేషన్ల లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

English summary
The spot has been cleared after the bomb was placed in a cylinder by BDS for a controlled explosion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X