ప్రియురాలితో మస్త్ మజా, ఎంజాయ్ చేసి సార్ ఎస్కేప్, పక్కింటి ప్రియుడు !
బెంగళూరు/రాయచూరు: ఆడపిల్లలను ప్రేమించి వారిని పెళ్లి చేసుకుంటామని లైంగికంగా వాడుకుంటున్న కిలాడీలు ఎక్కువ అవుతున్నారు. పట్టణాలు, సిటీల్లో మాత్రమే జరిగే ఇలాంటి సంఘటనలు ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించింది. పక్కింటి అబ్బాయి ప్రేమను ఓ డ్రామాలా చేసి నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిపై లైంగింక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోవాలని బలవంతో చెయ్యడంతో ఆమె ప్రియుడు ఇంటి నుంచి, ఊరు నుంచి పారిపోయాడు. కర్ణాటకలోని రాయచూరు జిల్లా సిరవార తాలూకా తొప్పలదొడ్డి గ్రామంలో ప్రేమ పేరుతో మోసం జరిగిన ఘటన చోటుచేసుకుంది. ఈ గ్రామంలో పక్కింటి అమ్మాయిని పక్కింటి అబ్బాయి మోసం చేశాడు.

న్యాయం కోసం ఓ యువతి పోరాటం చేస్తోంది. మల్లేష్, బాలిక ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్నారు. 6 నెలల క్రితం పెళ్లి చేసుకుంటానని నమ్మించి మల్లేష్ మోసం చేశాడు. యువతితో పాటు విహారయాత్రకు తిరిగి ఆమెను శారీరకంగా వాడుకున్న మల్లేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. తనను ప్రేమించి ప్రియుడు మల్లేష్ కావాలని ఆ యువతి పురుగుల మందు తాగింది.
అయితే కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలను కాపాడారు. విషం తాగడానికి గల కారణాన్ని అడిగితే పక్కింటి అబ్బాయి మల్లేష్ తనతో ప్రేమలో పడ్డాడని, తనను మోసం చేశాడని ఆమె చెప్పింది. కొన్నాళ్లుగా పక్కపక్కనే ఉండే కుటుంబసభ్యులు సన్నిహితంగా మెలిగారు. వీరి ప్రేమ వ్యవహారం కారణంగా ఇరు కుటుంబాల మధ్య శత్రుత్వ వాతావరణం నెలకొంది.

చివరగా వీరి ప్రేమను అంగీకరించేందుకు ఇరు కుటుంబాలు సిద్దం కావడంతో కుటుంబ సభ్యులు రాజీ పంచాయితీ చేసి ఇద్దరిని కలిపే ప్రయత్నం చేశారు. కానీ. దీనికి లొంగని మల్లేష్ యువతితో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా సంప్రదించకుండా మాయం అయిపోయాడు. చాలా రోజులు ఎదురుచూసినా ఇంటికి తిరిగి రాని మల్లేష్ మీద అతని ప్రియురాలు పోలీసు కేసు పెట్టింది. తాను మల్లేష్ ను మాత్రమే పెళ్లి చేసుకుంటానని ఆ యువతి తేల్చి చెప్పడంతో పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications