ముగ్గురు భర్తలు, అక్క మొగుడికి బోనస్, 400 కిలోమీటర్లు వెళ్లి బావతో కలిసి ఏం చేసిందంటే ?
వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. భార్య చెల్లెలికి వివాహం అయ్యింది. అక్క ఇంటికి వచ్చి వెలుతున్న మరదలు ఆమె బావను వలలో వేసుకుంది. మరదలితో బావ రొమాన్స్ చేస్తున్నాడు. అయితే బావతో రొమాన్స్ చేస్తున్న మహిళ ఆమె భర్తకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కిపోయింది. 400 కిలో మీటర్ల దూరం వెళ్లిపోయిన బావ, మరదలు వేరే వ్యక్తి ఇంటిలో శవమై కనిపించడం కలకలం రేపింది.
బెంగళూరులో లోకేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. లోకేష్ కు కొన్ని సంవత్సరాల క్రితం రంజిత అనే మహిళతో వివాహం అయ్యింది. లోకేష్, రంజిత దంపతులు చాలా సంతోషంగా జీవించారు. రంజితకు శాంతా అనే చెల్లెలు ఉంది. శాంతకు ఇంతకు ముందే వివాహం అయ్యింది. భర్తను వదిలేసిన శాంతా మరో వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండో భర్తతో కాపురం చేస్తున్న సమయంలోనే శాంతా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.

భార్య శాంతా అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న భర్త ఆమెను వదిలేశాడు. రెండో భర్తను కూడా వదిలేసిన శాంతా రెండు సంవత్సరాల క్రితం రమేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం శాంతా మూడో భర్త రమేష్ తో కాపురం చేస్తోంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న శాంతా ఆమె అక్క ఇంటికి వెళ్లి వస్తూ ఆమె బావ లోకేష్ ను వలలో వేసుకుంది. బావ లోకేష్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న శాంతా అతనితో రొమాన్స్ చేస్తోంది.
కొన్ని నెలల క్రితం లోకేష్, అతని మరదలు శాంతా రొమాన్స్ చేస్తున్న సమయంలో లోకేష్ భార్య రంజిత వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఇక ముందు నువ్వు నా భర్త లోకేష్ కలిసి తిరగకూడదని, మన సంసారంలో ఇబ్బందులు రాకూండా ఉండాలంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలని రంజిత ఆమె చెల్లెలు శాంతాకు బుద్ది మాటలు చెప్పి వారిని మందలించింది. అయితే లోకేష్, శాంతాలు మాత్రం అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు.
వారం రోజుల క్రితం శాంతా ఇంటికి వెళ్లిన లోకేష్ ఆమెతో బెడ్ రూమ్ లో రొమాన్స్ చేస్తున్నాడు. ఆ సందర్బంలో బయటనుంచి వచ్చిన శాంతా భర్త రమేష్ ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. భార్య శాంతాను చితకబాదిన రమేష్ తరువాత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. మన అక్రమ సంబంధం గురించి అందరికి తెలిసిపోయిందని, మనల్ని వీళ్లు బతకనివ్వరని శాంతా ఆమె బావ లోకేష్ కు చెప్పింది.

లోకేష్, అతని మరదలు శాంతా బుధవారం బెంగళూరు నుంచి సుమారు 400 కిలోమీటర్ల దూరంలోని హుబ్బళికి వెళ్లారు. తరువాత హుబ్బళి బస్ స్టాండ్ లో మారుతి అనే వ్యక్తి ఆటో ఎక్కారు. మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి భోజనం చేసిన తరువాత మళ్లీ బెంగళూరు వెళ్లిపోవాలని, మాకు ఏదైనా అనువుగా ఉండే చోటు చూపించాలని లోకేష్, శాంతా ఆటో డ్రైవర్ మారుతికి మనవి చేశాడు.
అయ్యోపాపం అనుకున్న ఆటో డ్రైవర్ మారుతి వారిని అతని ఇంటికి పిలుచుకుని వెళ్లాడు. మీరు స్నానాలు చేసి రెడీ అవ్వాలని, నేను ఒక గంటలో వస్తానని చెప్పిన మారుతి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. తరువాత లోకేష్ అతని భార్య రంజితకు వీడియో కాల్ చేసి మీరు మమ్మల్ని అవమానించారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నామని చెప్పాడు.
లోకేష్ ఎక్కడ ఉన్నాడో అనే విషయం అతని భార్య గుర్తించలేకపోయింది. తరువాత లోకేష్, అతని మరదలు శాంతా చీరతో ఆటో డ్రైవర్ మారుతి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటికి వెళ్లిన మారుతి ఇద్దరి శవాలు చూసి హడలిపోయి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థలంలో లోకేష్ మొబైల్ స్వాధీనం చేసుకుని బెంగళూరులోని అతని భార్య రంజితకు సమాచారం అందించారు. అయ్యోపాపం అనుకున్న పాపానికి ఆటో డ్రైవర్ మారుతి ఇప్పుడు చిక్కుల్లోపడ్డాడు.
-
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
చరిత్ర సృష్టించిన భారత ఆయిల్ ట్యాంకర్ 'జగ్ విక్రమ్'.. 20 వేల టన్నుల LPGతో హార్మూజ్ ను దాటి..











Click it and Unblock the Notifications