ఎలక్షన్ కమీషన్ ను మోసం చేసిన పొలిటికల్ లీడర్ ఫోర్జరీ బీఫామ్ తో, కన్నన్ కహాని !
బెంగళూరు/చెన్నై: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్, గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ, ఆప్, బీఎస్సీ, ఎన్సీపీ తదితర పార్టీలతో పాటు అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అయితే అన్నాడీఎంకే పార్టీ నాయకుల సంతకంతో పోర్జరీ చేసి బీఫామ్ సమర్పించారని ఆరోపిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి మీద కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటకలోని 224 అసెంబ్లీ ఎన్నికలో మూడు ప్రధాన పార్టీలతో పాటు అనేక పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీల్లో టిక్కెట్లు రాని కొందరు నాయకులు రెబల్స్ గా బరిలోదిగారు. కొన్ని నియోజక వర్గాల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థులుగా చాలా మంది రాజకీయ నాయకులు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం మాదే అంటూ చాలా మంది నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ (తమిళనాడు మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి వర్గం)కి చెందిన నాయకుడు బెంగళూరులోని పులకేశీనగర నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఒక్క నియోజక వర్గంలోనే తమ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తుతన్నారని ఇటీవల ఎడప్పాడి పళనిస్వామి చెన్నైలో చెప్పారు.
బెంగళూరులో తమిళ ప్రజలు ఎక్కువగా ఉండే గాంధీనగర నియోజక వర్గం నుంచి అన్నాడీఎంకే పార్టీ అభ్యర్థిగా కుమార్ కన్నన్ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఏ ఫామ్, బీఫామ్ లు ఎన్నికల అధికారులకు సమర్పించి ఎన్నికల బరిలో దిగారు. కుమార్ కన్నన్ సమర్పించిన ఏఫామ్, బీఫామ్ లో తమిళనాడు మాజీ సీఎం ఓ. పన్నీర్ సెల్వం సంతకం కూడా ఉందని అధికారులు అన్నారు.
మొదట అధికారులకు అనుమానం రాకపోయినా తరువాత కన్నన్ మీద అనుమానం వచ్చింది. అన్నాడీఎంకే పార్టీ బీఫామ్ అంటూ తప్పుడు పత్రాలు సమర్పించి ఎన్నికల అధికారులను మోసం చేశాడని ఆరోపిస్తూ రిటర్నింగ్ అధికారి కుమార్ కన్నన్ మీద బెంగళూరులోని కాటన్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కుమార్ కన్నన్ ను అన్నాడీఎంకే అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. అయితే ఎన్నికల అధికారులను మోసం చేశాడని ఆరోపిస్తూ కుమార్ కన్నన్ మీద చీటింగ్ కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయ్యింది. బెంగళూరులో అన్నాడీఎంకే పార్టీ అధికారిక అభ్యర్థి పులకేశీ నగర్ లో మాత్రమే ఉన్నాడని స్పష్టం అయ్యింది.












Click it and Unblock the Notifications