మాజీ మంత్రి, సినీ నిర్మాత, సిట్టింగ్ ఎమ్మెల్యే మీద కేసు, ఆ పార్టీ లీడర్ ను కిడ్నాప్ చేశారని!
కర్ణాటక మాజీ మంత్రి, బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే ఎం. మునిరత్న తదితరులపై బెంగళూరులోని నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాంగ్రెస్ కార్యకర్తను బీజేపీలోకి వచ్చేలా ప్రేరేపించడానికి అతన్ని కిడ్నాప్ చేశారనే ఆరోపణలపై నందిని లేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న మీద ఎఫ్ఐఆర్ నమోదైంది.
బెంగళూరులోని లక్ష్మీదేవి నగర్‌కు చెందిన పెయింటర్ శామ్యూల్ ఫిర్యాదు చేశారని పోలీసులు అన్నారు. బాధితుడు శామ్యూల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మునిరత్నతో పాటు అతని మద్దతుదారులు సురేష్, వసంత్, వాసీం, శీనాలపై కిడ్నాప్ తదితర ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు రెండు రోజుల క్రితం తనతో మాట్లాడాలనే సాకుతో వారి కార్యాలయానికి బలవంతంగా తీసుకెళ్లారని శామ్యూల్ ఆరోపించారు.

తరువాత తనను బీజేపీలో చేరాలని బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. అయితే తనపై వచ్చిన ఆరోపణలను బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఖండించారు.నేను చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉన్నానని ఇదే సమయంలో మునిరత్న గుర్తు చేశారు. నీతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే మునిరత్న పిలుస్తున్నారని చెప్పిన సురేష్, వసంత్, వాసీం, శీనాలు తనను డాక్టర్ రాజ్‌కుమార్ సమాధి వద్దకు పిలిపించారని బాధితుడు శామ్యూల్ ఆరోపిస్తున్నాడు.
అనంతరం తనను బలవంతంగా వయాలికావల్‌లోని ఎమ్మెల్యే మునిరత్న కార్యాలయానికి తీసుకెళ్లారని, అక్కడ ఎమ్మెల్యే మునిరత్న తనను బెదిరించాడని, తనకు ప్రాణహాని ఉందని శామ్యూల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నరేంద్ర మోదీ మళ్లీ ప్రధాని కావాలని తాను గతంలోనే స్వచ్చందంగా బీజేపీలో చేరానని ఎమ్మెల్యే మునిరత్న అన్నారు. తన మొదట కాంగ్రెస్ కార్యకర్త అని, తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యే అయ్యానని, తరువాతే తాను బీజేపీలో చేరానని ఎమ్మెల్యే మునిరత్న అన్నారు.

కావాలని నాపై తప్పుడు ఆరోపణలు చేశారని మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా పార్టీలో చేరాలనుకున్నప్పుడు వారిని చేర్చుకోవడం తన కర్తవ్యం అని, శామ్యూల్ బీజేపీలో చేరిన తర్వాత అదే వ్యక్తి బెంగళూరు రూరల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు హనుమంతరాయప్పను కలిశాడని ఎమ్మల్యే మునిరత్న అన్నారు.
తరువాత బెంగళూరులోని నందిని లేఅవుట్ పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండానే మా మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారని బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న ఆరోపించారు. బెంగుళూరు రూరల్ లోక్ సభ నియోజకవర్గంలో తాను ఎన్నిల్లో నేను బీజేపీ తరపున ప్రచారం చేయకుండా అడ్డుకునేందుకే కాంగ్రెస్ నాయకులు తన మీద తప్పుడు కేసు పెట్టారని, ఇలాంటి బెదిరింపులకు తాను భయపడను అని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, ప్రముఖ సినీ నిర్మాత మునిరత్న అన్నారు.
-
బీహార్ సీఎంగా లాలూకు నమ్మినబంటు: నాడు రబ్రీదేవి కేబినెట్ లో మంత్రి -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications