వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Economic Survey: కొత్త పదం థాలినోమిక్స్: ఉపాధి కల్పనకు చైనీస్ ఫార్ములా శరణ్యం: ఆర్థిక సలహాదారు..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

Union Budget 2020 : Economic Survey in Parliament | Why It Is Important?

న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ, ఉఫాధి అవకాశాలను మెరుగుపర్చడానికి చైనా అనుసరిస్తోన్న విధానాలను మనదేశంలో ప్రవేశ పెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని ఆయన ఆర్థిక సర్వే నివేదికలో పొందుపరిచారు. ఆర్థిక ప్రగతి పరుగులెత్తాలంటే సేవా రంగాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సేవారంగం బలోపేతం కావాలంటే ఉద్యోగాల కల్పన ఒక్కటే మార్గమని చెప్పారు.

నాలుగు కోట్ల ఉద్యోగాలకు కల్పించడానికి అవకాశాలు

నాలుగు కోట్ల ఉద్యోగాలకు కల్పించడానికి అవకాశాలు

ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో చైనా వైవిధ్యభరితమైన విధాానాలను అనుసరిస్తోందని కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా చైనా ఆవిర్భవించినప్పటికీ.. నిరుద్యోగుల సంఖ్య అక్కడ చాలా పరిమితంగా ఉందని అన్నారు. దీనికోసం కొన్ని అరుదైన విధానాలను చైనా రూపొందించుకుందని, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందని చెప్పారు. అదే ఫార్ములాను భారత్‌లో అమలు చేయడం ద్వారా నాలుగు కోట్ల ఉద్యోగాలను కల్పించవచ్చని అన్నారు.

పారిశ్రామిక రంగం ఏకీకరణ..

పారిశ్రామిక రంగం ఏకీకరణ..

పారిశ్రామిక రంగాన్ని ఏకీకరించడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి వీలుంటుందని సుబ్రమణియన్ అన్నారు. పారిశ్రామిక రంగంతో ముడిపడి ఉన్న ప్రతి విభాగాన్నీ ఏకీకరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉత్పాదక రంగం, రవాణా రంగం, మార్కెటింగ్.. ఇలా వేర్వేరుగా విభజించడం వల్ల సూక్ష్మస్థాయిలో ఆశించిన ప్రయోజనాలు లభించట్లేదని చెప్పారు. పారిశ్రామిక ఏకీకరణ వల్ల అవకాశాలు విస్తృతమౌతాయని అభిప్రాయపడ్డారు.

కొత్త పదం థాలినోమిక్స్..

కొత్త పదం థాలినోమిక్స్..

ఈ సారి ఆర్థిక సర్వేలో ఓ ఆసక్తికరమైన పదం కనిపిచింది. అదే- థాలినోమిక్స్. థాలి నుంచి తీసుకున్న పదం అది. థాలి- పంచభక్స్య పరమాన్నాాలతో కూడిన పల్లెంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఉత్తరాదికి చెందిన పదం థాలి. `థాలినోమిక్స్: ది ఎకనమిక్స్ ఆఫ్ ఎ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా..` పేరుతో దీన్ని ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. దీన్ని ఆధారంగా చేసుకుని ఆర్థిక సర్వేలో కొన్ని కీలక అంశాలను పొందుపరిచారు.

థాలి రేట్ల ఆధారంగా..

థాలి రేట్ల ఆధారంగా..

థాలి రేట్ల ఆధారంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా వచ్చినట్లు స్పష్టమౌతోంది. 2006-2007 నుంచి 2019-2020 ఆర్థిక సంవత్సరం మధ్య థాలి రేట్లను ఆధారంగా చేసుకుని ఓ సర్వేను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. 2006-07 నుంచి 2019-2020 మధ్యకాలంలో శాకాహార థాలి రేటులో 29 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. అదే సమయంలో- మాంసాహార థాలి రేటులో 18 శాతం క్షీణత కనిపించింది. ఈ రేట్ల ఆధారంగా కొన్ని అంశాలను పొందుపరిచినట్లు తెలుస్తోంది.

English summary
A Chinese formula to create 4 crore more jobs, says Chief Economic Advisor Krishnamurthy Subramanian. The Economic Survey Prepared by Chief Economic Advisor Krishnamurthy Subramanian. The economy over the previous 12 months and also gives an outlook for the next financial year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X