వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా వీసా: చైనీయులకు సులభం.. భారతీయులకు తిప్పలే!

అమెరికా వీసా పొందడం చైనీయులకు సులభంగా మారితే భారతీయులకు రెండింతలు కష్టంగా మారింది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా నిబంధనలు మరింత కఠినం అయ్యాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అమెరికా వీసా పొందడం చైనీయులకు సులభంగా మారితే భారతీయులకు రెండింతలు కష్టంగా మారింది. అసలు అమెరికా వీసా పొందడమే ఒక పెద్ద ప్రహసనం. అగ్రరాజ్యం అడిగే అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉంటేనే ఆ దేశంలోకి అనుమతి లభిస్తుంది.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత వీసా నిబంధనలు మరింత కఠినం అయ్యాయి. అన్ని పత్రాలు సమర్పించి, కాన్సులేట్ అధికారులను మెప్పించి, ఒప్పిస్తేనే వీసా దక్కేది.

A Chinese has a better chance of getting US visa than an Indian

ఈ విషయంలో పొరుగుదేశం చైనా మనకంటే కాస్త ముందంజలోనే ఉంది. అమెరికాలో ప్రవేశానికి లభించే విసాల విషయంలో.. భారతీయులతో పోల్చితే.. చైనీయులకే ఆమోదముద్ర ఎక్కువగా పడుతోందని తాజా గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికా వెళ్లేందుకు భారతీయులు చేసుకున్న దరఖాస్తుతో పోలిస్తే చైనా వారి దరఖాస్తు వేగంగా ముందుకు కదులుతోంది. ఈ క్రమంలో వీసా తిరస్కరణ రేటు భారతీయులకు రెండు రెట్లు ఎక్కువగా ఉందట. దశాబ్ద కాలంలో చైనాకు వీసా తిరస్కరణ రేటు క్రమంగా తగ్గగా, భారత్‌కు మాత్రం పెరుగుతూ రావడం గమనార్హం.

2006-2016 మధ్య కాలంలో భారతీయుల వీసా తిరస్కరణ రేటు 6.5 శాతం పెరగడం ద్వారా 26 శాతానికి చేరింది. ఇక చైనా విషయంలో 12.2 శాతం తగ్గి 12.4 శాతానికి చేరింది.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందే క్రమంలో విదేశీ కంపెనీలకు స్వాగతం పలకడం, పెద్ద సంఖ్యలో అమెరికన్‌, యూరోపియన్‌ బిజినెస్‌లను ఆకర్షించడంపై చైనా ప్రధానంగా దృష్టి సారించడం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికా అత్యధికంగా వీసా దరఖాస్తులను తిరస్కరించిన దేశం ఏదో తెలుసా? క్యూబా. ఆ దేశ వీసా తిరస్కరణ రేటు 81.9 శాతంగా ఉంది. ఇక సౌదీ అరేబియా వీసా తిరస్కరణ రేటు 7.3 శాతం తగ్గడం ద్వారా 4 శాతంగా ఉంది.

ఇజ్రాయిల్‌ విసా తిరస్కరణ శాతంలో ఎలాంటి మార్పూ లేదు. ఇక బ్రిక్స్‌ దేశాల్లో దక్షిణాఫ్రికా 6.8 శాతంతో అతి తక్కువ యూఎస్‌ వీసా తిరస్కరణ రేటు కలిగి ఉండగా, భారత్‌దే అత్యధికం. బ్రెజిల్‌, రష్యాలు వరుసగా 16.7 శాతం, 9.35 శాతంతో ఉన్నాయి. బ్రిక్స్‌లోనే చైనా కూడా ఉంది.

English summary
Does the US like the Chinese more than Indians? An Indian applying for a non-immigrant visas to enter the US is far less likely to get it than a Chinese applicant. Visa refusal rate for India is twice as much as for China. And while China's visa refusal rate has gone down in the past decade, India's rate has gone up. India's US visa refusal rate is 26%, up 6.5% between 2006 and 2016. China's US visa refusal rate is 12.4, down 12.2% in the same period. The refusal rate reflects the US has veered towards China in the past decade. In the past decade, China opened up itself for foreign companies, attracting a large number of American and European businesses and also improving its global image in the process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X