కాలేజ్ ప్రిన్సిపల్ ను హత్య చేసిన విద్యార్థి

రాంచీ: పాతకక్ష పెంచుకున్న విద్యార్థి తన కాలేజ్ ప్రిన్సిపాల్ ను అతి దారుణంగా హత్య చేసిన సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. హత్య చేసి హాయిగా బయట తిరుగుతున్న విద్యార్థిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

జార్ఖండ్ లోని గుమ్లా జిల్లాలో కార్తీక్ ఒరయెన్ కాలేజ్ ఉంది. ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గా శశిభూషణ్ ప్రసాద్ అనే ఆయన పని చేస్తున్నారు. బుధవారం శశిభూషణ్ ప్రసాద్ కాలేజ్ లోని ఆయన కార్యాలయంలో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ విద్యార్థి లోపలికి వెళ్లాడు.

A college principal was killed by a student in Jharkhand

తరువాత పదునైన ఆయుధం తీసుకుని ఆయన మెడ మీద పదేపదే దాడి చేసి అక్కడి నుంచి పరారైనాడు. విషయం గుర్తించిన కాలేజ్ సిబ్బంది శశిభూషణ్ ప్రసాద్ ను ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై శశిభూషణ్ ప్రసాద్ మరణించాడని గురువారం పోలీసులు చెప్పారు.

అయితే కాలేజ్ ప్రిన్సిపాల్ శశిభూషణ్ ప్రసాద్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని పోలీసులు అన్నారు. బుద్ధిమాటలు చెప్పినందుకే శశిభూషణ్ ప్రసాద్ ను ఆ విద్యార్థి హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+