వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్ కౌంటర్: భారత్ ఆర్మీ కల్నల్ మృతి

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్ము కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదులు, భారత్ జవాన్ల మద్య జరుగుతున్న ఎన్ కౌంటర్ లో భారత్ ఆర్మీ కల్నల్ వీరమరణం పొందారు. ఉగ్రవాదులను పట్టుకోవడానికి సైన్యం రంగంలోకి దిగిందని సీనియర్ అధికారులు తెలిపారు.

ఉత్తర కాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని మణిగావ్ అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారని, అదును చూసి దాడులు చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారని బీఎస్ఎఫ్ అధికారులకు సమాచారం అందింది. మంగళవారం వేకువ జామున నుంచి మణిగావ్ అడవుల్లో ఉగ్రవాదుల కోసం గాలించారు.

A Colonel of the Indian Army has been killed in Kashmir.

ఆ సందర్బంలో ఎదురుపడిన జవాన్ల మీద నలుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో బుల్లెట్ గాయాలై ఓ ఆర్మీ కల్నల్ మరణించారని, ఇద్దరికి గాయాలైనాయని అధికారులు తెలిపారు.

గత వారంలో ఇదే ప్రాంతంలో ఉగ్రవాదులు, భారత్ జవాన్ల మద్య ఎన్ కౌంటర్ జరిగింది. తరువాత కొందరు ఉగ్రవాదులు తప్పించుకుని పాక్ అక్రమిత కాశ్మీర్ లోయలోకి పరారైనారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఉగ్రవాదులు ప్రత్యక్షం కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

English summary
A Colonel of the Indian Army has been killed in an encounter between terrorists and security forces in Kupwara district in north Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X