సిటి పోలీసు కమిషనర్ పై లోకాయుక్తలో ఫిర్యాదు
బెంగళూరు: ఐటి, బీటీ సిటి అయిన బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా భాద్యతలు స్వీకరించడానికి గతంలో చివరికి వరకు పోటి పడిన పోలీసు అధికారి కొంత కాలం వేచి ఉండి ఇప్పుడు అదే పోలీసు కమిషనర్ మీద అవినీతికి పాల్పడ్డారని లోకాయుక్తకు ఫిర్యాదు చెయ్యడంతో పోలీసు అధికారులు ఉలిక్కిపడ్డారు.
బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి మీద కర్ణాటక లోకాయుక్త లో ఫిర్యాదు చేశారు. కర్ణాటక పోలీస్ హౌసింగ్ బోర్డు సీఎండీ, సీనియర్ ఐపీఎస్ అధికారి సుశాంత్ మహాపాత్ర తన సాటి ఐపీఎస్ అధికారి మీద ఫిర్యాదు చెయ్యడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.
ఎం.ఎన్. రెడ్డి గతంలో కర్ణాటక హౌసింగ్ బోర్డు సీఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఆ సందర్బంలో కొత్తగా నిర్మించిన పోలీస్ స్టేషన్లు, పోలీసు క్వాటర్స్ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడ్డారని సుశాంత్ మహాపాత్ర ఆరోపిస్తున్నారు.

తరువాత బెంగళూరు నగర పోలీసు కమిషనర్ కుర్చిలో కుర్చోవాలని సుశాంత్ మహాపాత్ర చివరికి వరకు పోరాటం చేశారు. అయితే ఎం.ఎన్. రెడ్డి వైపు ప్రభుత్వం మొగ్గు చూపడంతో మహాపాత్ర తీవ్ర నిరాశకు గురైనారు. తరువాత ఆయన హౌసింగ్ బోర్డు సీఎండీ కుర్చిలో కుర్చున్నారు.
కర్ణాటక ఉప లోకాయుక్త న్యాయమూర్తి సుభాష్ అడికి ఫిర్యాదు చేశారు. గతంలో ఎం.ఎన్. రెడ్డి మీద రాష్ట్ర హౌం శాఖ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో ఇప్పుడు మహాపాత్రో లోకాయుక్తను ఆశ్రయించారని పోలీసు వర్గాలు అంటున్నాయి.












Click it and Unblock the Notifications