అక్రమ సంబంధం, భర్త పోలీసు, ఎస్పీ ఆఫీసులోనే భర్తను చంపేసిన భర్త, దర్జాగా ?
పోలీసు అతని భార్యను కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన సంఘటన కర్ణాటకలోని హసన్ నగర్‌లోని ఆర్‌సీ రోడ్డులోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం ఆవరణలో చోటుచేసుకుంది., హాసన్ లోని హొయ్సళ నగరలోని నిందితుడు అయిన భర్త, పోలీస్ కానిస్టేబుల్ లోక్‌నాథ్ నివాసం ముందు మంగళవారం అతని భార్య కుటుంబ సభ్యులు నిరసనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అక్రమ సంబంధం పెట్టుకుని భార్యను చిత్రహింసలు పెట్టన లోకనాథ్ తో పాటు అతని తండ్రి, తల్లిని అరెస్ట్ చేసి కేసు పెట్టాలని బాధితురాలు మమత తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు. మమత మృతదేహం ముందు ఆమె తల్లిదండ్రులు, ఇద్దరు కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ ఉండడం, ప్రజలు భారీ సంఖ్యలో గుమికూడటంతో ఘటనా స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.మమత ఆమె భర్త చేతిలోనే జిల్లా ఎస్పీ ఆఫీసు ఆవరణంలోనే దారుణ హత్యకు గురైయ్యింది.

పోలీస్ కానిస్టేబుల్ లోక్‌నాథ్ అతని భార్య మమతను హత్య చేశాడు. హాసన్ సిటీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి నిందితుడు లోక్ నాథ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.పదిహేడేళ్ల క్రితం హాసన్ నగర శివారులోని చెన్నపట్టనకు చెందిన మమత, కేఆర్ పురంకు చెందిన లోకనాథ్ తల్లిదండ్రుల వ్యతిరేకతను సైతం లెక్కచేయకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
లోక్ నాథ్, మమత దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత కానిస్టేబుల్ లోకనాథ్ తన భార్యను కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. ఇదే కారణంతో భార్య మమతను వేధించడమే కాకుండా శారీరకంగా ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. భర్త లోక్ నాథ్ వేధింపులతో మమత మానసికంగా కుంగిపోవడమే కాకుండా భర్త నీచమైన పనిని తల్లిదండ్రులకు చెప్పింది.గత మూడు నాలుగు రోజులుగా భార్యాభర్తల మధ్య పెద్దఎత్తున గొడవలు జరుగుతున్నాయి.
భర్త లోకనాథ్ వేధింపులకు విసుగు చెందిన మమత సోమవారం జిల్లా పోలీసు కార్యాలయానికి వెళ్లి నీ మీద కేసు నమోదు చేస్తానని భర్త లోక్ నాథ్ ను హెచ్చరించింది. పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి వెలుతున్న భార్య మమతను వెంబడించిన కానిస్టేబుల్ లోకనాథ్ పదునైన ఆయుధంతో మమత ఛాతీపై బలంగా పొడవడంతో ఆమె వీపు నుంచి కత్తి బయటకు వచ్చింది. రక్తపు మడుగులో పడి ఉన్న మమతను సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కొద్ది దూరంలోనే ఉన్న జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అయితే చికిత్స అందక మమత మృతి చెందింది. నిందితుడు లోక్‌నాథ్‌ను హసన్ నగర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ మహ్మద్ సుజీత్ ఆసుపత్రిని సందర్శించి సమాచారం తెలుసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి భార్య మమత హత్యకు గురికావడం, భర్త లోక్ నాథ్ జైలుపాలు కావడంతో వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.
ఉయదం ఎస్పీ కార్యాలయం ఆవరణలో మమతను పాశవికంగా హత్య చేయడంతో హాసన్ నగర్ వాసులను కలచివేసింది. హాసన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతురాలు మమత తండ్రి శ్యామన్న మాట్లాడుతూ కట్నం డబ్బులు, సైట్లు, వస్తువులు తీసుకురావాలని తన అల్లుడు లోక్ నాథ్ నిత్యం తన కూతురిని వేధించేవాడని, చివరికి ఎస్పీ కార్యాలయం దగ్గరే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నాడని, ఇలాంటి వాడిని వదిలిపెట్టకూడదని పోలీసులకు ముందు బోరున విలపించాడు. కేసు దర్యాప్తులో ఉంది.












Click it and Unblock the Notifications