వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి మరణ శిక్ష, 33 రోజుల్లోనే తీర్పు ఇచ్చిన కోర్టు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
surat rape case

గుజరాత్‌లోని సూరత్‌లో రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు గుడ్డు యాదవ్(35)కి మరణ శిక్ష విధిస్తూ సూరత్‌లోని సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. సెషన్స్ కోర్టు రికార్డు స్థాయిలో 33 రోజుల్లోనే తీర్పు వెలువరించడం గమనార్హం.

"సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే సూరత్ పోలీసులు నిందితుడు గుడ్డు యాదవ్‌ను అరెస్టు చేశారు. అతడిని పట్టుకోవడానికి 100 మంది పోలీసులు పగలు రాత్రి శ్రమించారు. బాధిత కుటుంబానికి కోర్టు న్యాయం చేసింది. రికార్డు సమయంలో తీర్పు చెప్పింది. బాధితురాలి కుటుంబ సభ్యులకు పరిహారం చెల్లించాలని కూడా ఆదేశించింది.'' అని బీబీసీ ప్రతినిధి భార్గవ్ పారిఖ్‌కి ​​ఇచ్చిన ఇంటర్వ్యూలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నయన్ సుఖద్వాలా చెప్పారు.

సూరత్‌లోని పండేసర ప్రాంతంలో గుడ్డు యాదవ్ ఒక చిన్నారిని తీసుకుని వెళ్లడం సీసీ కెమెరాలో రికార్డయింది. ఆ బాలికపై అత్యాచారం చేసిన తర్వాత, గుడ్డు యాదవ్ ఆమెను హతమార్చాడు. తరువాత ఆమె మృతదేహాన్ని ఖాళీ స్థలంలో పడేశాడని పోలీసులు తెలిపారు. 7 రోజుల్లోనే కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
A convict convicted of raping and killing a two-and-a-half-year-old girl has been sentenced to death by a court in 33 days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X