కౌగిలించుకుని చెరువులో శవాలు అయిన జంట, ఆంటీతో ఏమిటి సంబంధం ?
ఒకరినొకరు కౌగిలించుకున్న జంట మృతదేహం లభ్యమైన సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలోని హిరోడ్ లోని చెరువులోని నీళ్లు వెళ్లే తూములో ఓ మహిళ, పురుషుడు ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని శవాలై కనిపించారు.
మృతుల గురించి ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని పోలీసులు అంటున్నారు. మృతుల వయస్సు 40 నుంచి 45 ఏళ్లు ఉంటుందని పోలీసులు అంచనా వేశారు.

మహిళతో పాటు మరో వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద స్థితిలో మహిళ, పురుషుడి మృతదేహాలు లభ్యమయ్యాయి. చెరువు గట్టు మీద మట్టిలో మృతదేహం లభ్యం కావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడు రోజుల ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉదయం స్థానికులు చెరువు దగ్గరకు రావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పాండవపు టౌన్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ఈ ఘటన పాండవపుర టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలిసి 2 గంటలు గడిచినా పోలీసులు సంఘటనా స్థలానికి రాలేద స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇద్దరూ అక్రమ సంబందం పెట్టుకుని ఏమైనా ఆత్మహత్య చేసుకున్నారా ? అని అనుమానాలు ఉన్నాయని పోలీసులు అంటున్నారు.













Click it and Unblock the Notifications