వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలిసారి అనుప్రియ: ఆ ముగ్గురికి మోడీ ఛాన్స్ వెనుక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం చేసిన కేబినెట్ విస్తరణలో 19మంది కొత్త వారికి అవకాశమిచ్చారు. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల దృష్ట్యా ఈ మంత్రివర్గ విస్తరణ కనిపించిందని చెప్పవచ్చు. యూపీ నుంచి ముగ్గురిని తీసుకున్న మోడీ.. అందులోను వ్యూహాత్మకంగా వ్యవహరించారు.

విస్తరణ: ప్రధాని మోడీ స్ట్రాటజీ, కొత్త మంత్రులు వీరే..

చాండౌలి ఎంపీ మహేంద్ర పాండే (బ్రాహ్మిణ్), షాజహాన్‌పుర ఎంపీ క్రిష్ణరాజ్ (దళిత్), మీర్జాపూర్ ఎంపీ అనుప్రియా పటేల్ (కుర్మి - ఓబీసీ)ని తీసుకున్నారు. వీరు ముగ్గురు కూడా మొదటిసారి ఎంపీగా అయ్యారు. అయినప్పటికీ కేబినెట్లోకి తీసుకున్నారు.

A Dalit, a OBC & a Brahmin: How Modi's Cabinet rejig went for UP polls 2017

స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి గెలిచారు. యూపీ నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో 80 స్థానాలకు గాను 72 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇప్పుడు మరో ముగ్గురికి కేంద్రమంత్రి పదవులు ఇవ్వడం ద్వారా.. యూపీని తాను మరిచిపోలేదనే సంకేతాలను ప్రధాని మోడీ ఇచ్చారని అంటున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో యూపీలో బీజేపీ నుంచి పలువురు కొత్త అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాని మోడీ హవాలో వారు గెలుపొందారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లోను కొత్తవారికి అవకాశమివ్వనున్నారు. అదే సమయంలో పాతవారిని పక్కన పెట్టే పరిస్థితి లేదు.

విస్తరణ: ఏపీ-తెలంగాణలకు నో, 6గురు మంత్రులకు మోడీ ఉద్వాసన

2017లో జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలను ప్రధాని మోడీ సెమీ ఫైనల్స్‌గా చూస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆ తర్వాత రెండేళ్లకు అంటే 2019లో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి.

కృష్ణరాజ్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో దళిత ఓట్లను ఆకర్షించేందుకు ప్రధాని మోడీ కృష్ణరాజ్‌ను కేబినెట్లోకి తీసుకున్నారు. దళితులు ఎక్కువ మంది బీఎస్పీ వైపు ఉంటారు. అయితే, ఎస్పీ మౌర్య ఇటీవలే బీఎస్పీ నుంచి బయటకు వచ్చారు. ఈ ప్రభావం బీఎస్పీ పైన పడింది. దీనిని క్యాష్ చేసుకునేందుకు మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పోస్ట్ గ్రాడ్యుయేట్, బిజినెస్ పర్సన్ అయిన కృష్ణరాజ్‌ను తీసుకున్నారు.

ఈమె 1996, 2007లో మొహమ్మది నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012లో కస్తా నుంచి ఓటమి చవిచూశారు. యూపీకే చెందిన కటారియాకు ఉద్వాసన పలికారు. ఇతను ఆగ్రా దళిత ఎంపీ. అతని స్థానంలో దళితులను ఆకట్టుకునేందుకు కృష్ణరాజ్‌ను తీసుకు వచ్చారు.

అనుప్రియ పటేల్: ఈమె సోనే లాల్ పటేల్ కూతురు. 2012 ఎన్నికల్లో అనుప్రియ వారణాసి నుంచి తన తండ్రి స్థాపించిన అప్నాదళ్ నుంచి పోటీ చేశారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని, రెండు సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా అనుప్రియా పటేల్ ప్రచారంలోకి వచ్చారు.

తల్లి గెంటెస్తే! అనుప్రియను కేంద్రమంత్రిని చేసిన మోడీ

ఢిల్లీలోని శ్రీరాం యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2014 ఎన్నికల్లో లోకసభ ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆమె రోహనియా అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాజీనామా చేశారు. అదే స్థానంలో ఆమె తల్లి కృష్ణపటేల్ గెలవలేకపోయారు. ఓబీసీలను ఆకట్టుకునేందుకు అనుప్రియను తీసుకున్నారు.

మహేంద్ర నాథ్ పాండే: బ్రాహ్మణులను ఆకట్టుకునేందుకు పాండేను తీసుకుంది. వాజపేయి అనంతరం ఇక్కడి నుంచి ఆ కమ్యూనిటీకి చెందిన పెద్ద లీడర్ లేరు. అదే సమయంలో మోడీకి, అమిత్ షాకు పాండే చాలా దగ్గర. 2007, 2012 ఎన్నికల్లో బ్రాహ్మిణ్ ఓటర్లు బీఎస్పీ వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు తమ వైపు రప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇతను 1991, 1996లలో ఇతను సైదాపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

English summary
The NDA government at the Centre saw a cabinet rejig on Tuesday (July 5) whereby three fresh faces from poll-bound Uttar Pradesh were inducted into the Council of Ministers. The three are Chandauli MP Mahendra Pandey (Brahmin), Shahjahanpur MP Krishna Raj (Dalit) and Mirzapur MP Anupriya Patel (Kurmi-OBC). All the three MPs are first-timers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X