షిర్డీ సాయికి వజ్రాలతో అద్భుతమైన కిరీటం, భక్తుడి కానుక- విలువ..ప్రత్యేకతలు..!!
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతం షిర్డీ భక్తులతో రద్దీగా ఉంది. కొత్త సంవత్సరం వేళ షిర్డీ సాయిబాబా ను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బాబా సమాధిని దర్శించుకుని, తమ మొక్కులు చెల్లించుకున్నారు. చాలా మంది భక్తులు తమ స్థోమతకు తగ్గట్టుగా విరాళాలు సమర్పించారు. అందులో భాగంగా ఒక భక్తుడు సమర్పించిన బంగారం.. వజ్రాల కిరీటం అందరినీ ఆకట్టుకుంటోంది. భక్తుల రద్దీతో సాయినాధుని నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.
షిర్డీ సాయినాధుని దర్శనం కోసం దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ సమయంలో బాబాకు హరియాణాకు చెందిన ఓ సాయి భక్తుడు కళ్లు చెదిరే కానుకను సమర్పించారు. సాయిబాబా పైన తన భక్తిని చాటుకున్నాడు. ఏకంగా రూ.80 లక్షల విలువైన బంగారు, వజ్రాల కిరీటాన్ని బాబా పాదాల చెంత ఉంచారు. నూతన సంవత్సర కానుకగా సమర్పించిన ఈ కిరీటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

దాని అందం, అందులో పొదిగిన వజ్రాల మెరుపులు చూసి భక్తులు ఆశ్చర్యపోతున్నారు. ఫరీదాబాద్‌కు చెందిన ప్రదీప్ మొహంతి తన కుటుంబంతో కలిసి కొత్త సంవత్సరం సందర్భంగా శిర్డీకి వచ్చారు. గురువారం రాత్రి ఆయన సాయిబాబా సమాధిని దర్శించుకున్నారు. బాబాపై తనకున్న నమ్మకానికి గుర్తుగా ఏదైనా ప్రత్యేకంగా ఇవ్వాలనుకున్నారు.
అందుకే ఎంతో విలువైన, అద్భుతమైన డిజైన్‌తో కూడిన కిరీటాన్ని చేయించారు. దర్శనం అనంతరం బాబా సమాధి వద్ద పూజలు చేసి ఈ కిరీటాన్ని సమర్పించారు. ఈ కిరీటం ప్రత్యేకత లను సాయిబాబా సంస్థాన్ వెల్లడించింది. ఈ కిరీటం మొత్తం బరువు 655 గ్రాములు. ఇందులో 585 గ్రాముల స్వచ్ఛమైన బంగారాన్ని ఉపయోగించారు. కిరీటాన్ని మరింత అందంగా తీర్చి దిద్దేందుకు ఏకంగా 153 క్యారెట్ల విలువైన వజ్రాలను పొదిగారు.
ఈ వజ్రాల మెరుపులతో కిరీటం దగదగా మెరిసిపోతోంది. దీని మొత్తం విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. కిరీటం డిజైన్ చాలా సంక్లిష్టంగా, కళాత్మకంగా ఉంది. కొద్దిసేపు ఈ వజ్రాల కిరీటాన్ని సాయిబాబా విగ్రహానికి అలంకరించారు. ఆ సమయంలో బాబా రూపు మరింత తేజోవంతంగా కనిపించింది. అనంతరం శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications