Patna: యూట్యూబ్ చూస్తూ ఆపరేషన్ చేసిన నకిలీ వైద్యుడు.. చనిపోయిన బాలుడు..
మనకు ఏమైనా డౌట్ వస్తే ఏం చేస్తాం.. ఎవరినైనా అడుగుతాం. వారికి కూడా తెలియపోతే.. నెట్ చూస్తాం. ఇంకా క్లియర్ తెలియాలంటే యూట్యూబ్ లో చూస్తాం. ఇలానే యూట్యూబ్ చూస్తూ చాలా మంది వంటలు చేస్తుంటారు. రకరకాలు చేస్తుంటారు. కొంత మంది యూట్యూబ్ లో చూసి దొంగతనం కూడా చేసిన ఘటనలు ఉన్నాయి. అయితే ఓ నకిలీ వైద్యుడు కూడా యూట్యూబ్ లో చూస్తూ ఆపరేషన్ చేసి బాలుడి మృతికి కారణమయ్యాడు.
ఈ ఘటన బీహార్ లో జరిగింది. బీహార్‌లోని సరన్‌కు చెందిన 15 ఏళ్ల బాలుడి వాంతులు అయ్యాయి. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే దగ్గరలోని గణపతి ఆస్పత్రికి తరలించారు. అయితే బాలుడికి అప్పటికే వాంతులు తగ్గాయి. కానీ నకిలీ వైద్యుడు బాలుడి ఆపరేషన్ చేయాలని చెప్పాడు. పిత్తాశయంలో రాళ్లు ఉన్నాయని వాటిని తొలగించాలని చెప్పాడు. దాని కోసం ఆపరేషన్ చేయాలని చెప్పాడు. అయితే బాలుడి తల్లిదండ్రులు తర్వాత చేయిస్తామని చెప్పారు.

కానీ ఫేక్ డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలని వారిని ఒప్పించాడు. యూట్యూబ్ లో చూస్తూ బాలుడికి పిత్తాశయ శస్త్రచికిత్స చేశాడు. చికిత్స వికటించి బాలుడు మృతి చెందాడు. శస్త్రచికిత్స అనంతర పరిస్థితి విషమించడంతో బాలుడిని పాట్నాలోని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయాడు. మృతుడు కృష్ణ కుమార్‌గా గుర్తించారు. నకిలీ వైద్యుడు ఆస్పత్రి వదలి పారిపోయినట్లుగా తెలిసింది.
"అడ్మిషన్ తర్వాత అతని పరిస్థితి మెరుగుపడింది. కానీ "డా." అజిత్ కుమార్ పూరి సర్జరీ చేయాలని పట్టుబట్టారు.
యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఆపరేషన్ చేశాడని. తర్వాత నా కొడుకు చనిపోయాడు" అని బాలుడి తండ్రి చందన్ షా తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్పత్రిని కూడా సీజ్ చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications