టీ తాగి ఒకే కుటుంబంలో నలుగురి మృతి

Posted By:
Subscribe to Oneindia Telugu

కాన్పూర్: టీ తాగి ఒకే కుటుంబంలో నలుగురు మరణించిన సంఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను స్థానిక పోలీసులు మీడియాకు చెప్పారు.

కాన్పూర్ సమీపంలోని అమృత్ పూర్ అనే గ్రామంలో రాణి (32) అనే మహిళ నివాసం ఉంటున్నది. ఈమెకు మున్సి (8), కనహియ (7), ఉపాసన (3) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. రాణి గృహిణి.

A family died after consuming poisonous tea in Uttar Pradesh

ఈమె ఉదయం టీ తయారు చేసి పిల్లలకు ఇచ్చి ఆమె తాగింది. అయితే టీ విషపూరితం కావడంతో వారు నలుగురు కుప్పకూలిపోయారు. వాంతులు, విరేచనాలు అయ్యాయి. కుటుంబ సభ్యులు బంధువులు వారిని ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నించారు.

అయితే నలుగురు చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నలుగురి మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టుం నివేదిక వచ్చిన తరువాత పూర్తి వివరాలు చెబుతామని పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A senior police official said, "The tea is suspected to be poisonous, however, the postmortem report will reveal the truth.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి