viral video: రైలు ఆగింది కదా అని దిగారు.. అప్పుడే మరో ట్రాక్ పై ట్రైన్.. చివరికి ఏమైందంటే..
ఒక్కోసారి అనుకోనివి జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనల్లో త్రుటిలో ప్రాణాపాయం తప్పుతోంది. ఇలానే ఓ కుటుంబం కొద్ది తేడాతో ప్రాణాలు దక్కించుకుంది. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. అయితే ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు.

రైల్వే స్టేషన్ కు కొద్ది దూరంలో..
ఈ వీడియోలో రైలు సిగ్నల్ ప్రాబ్లమ్ కారణంగా రైల్వే స్టేషన్ కు కొద్ది దూరంలో ఆగింది. ఆగింది కదా అని
ఓ కుటుంబం రైలు దిగింది. అప్పుడే పక్క ట్రాక్ లో 80 కి.మీ స్పీడ్ ఓ రైలు వస్తోంది. దీంతో వారికి ఏం చేయాలో తెలియలేదు. ట్రాక్ పై అటు ఇటు పరిగెత్తుతూ చివరికి త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ సంఘటనంత నిలిచిఉన్న రైలులో ఉన్న వీడియో తీశారు.

పట్టాలపై దిగడం ప్రాణాలకే ముప్పు..
ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.అయితే ఇందులో ప్రయాణికుల తప్పిదం స్పష్టంగా కనిపిస్తుంది. వారు స్టేషన్ లో దిగకుండా ఇలా పట్టాలపై దిగడం వారి ప్రాణాలపైకి తెచ్చింది. అందుకే రైల్వే అధికారులు రైల్వేస్టేషన్ లో మాత్రమే దిగాలని కోరుతున్నారు. పట్టాలు దాటకుండా ఫుట్ ఓవర్ బ్రిడ్చ్ వాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తప్పు చేశారు..!
ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేశారు. వారు తప్పు చేశారని ఒకరు కామెంట్ చేయగా.. ఈ రోజు మీకు మంచి జరిగిందని మరొకరు కామెంట్ చేశారు. ఇలాంటి పనులు చెయ్యొద్దను ఇంకొకరు కామెంట్ చేశారు. ఏది ఏమైనా ప్రయాణికులు చేసే చిన్న చిన్న తప్పులు వారి ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకే రైలులో ప్రయాణించేవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications