బిడ్డలు చెప్పిన మాట వినలేదని ఇంటికి పెట్రోల్ పోసి నిప్పంటించిన తాగుబోతు తండ్రి, కుమార్తె ఉద్యోగి!

బెంగళూరు: కన్న బిడ్డలు తాను చెప్పినట్లు వినడం లేదని, తనను లెక్కచెయ్యకుండా తిరుగుతున్నారని ఆరోపిస్తూ వారు నిద్రపోతున్న సమయంలో ఇంటికి నిప్పంటించి సజీవదహనం చెయ్యాలని ప్రయత్నించాడు ఓ కసాయి తండ్రి. ఇంటికి నిప్పంటుకుందని గ్రహించిన బిడ్డలు ఇరుగు పొరుగు వారి సహాయంతో ప్రాణాలతో భయటపడిప ఘటన బెంగళూరు నగరంలోని నందిని లేఔట్ లో జరిగింది.

తాగుబోతు తండ్రి

తాగుబోతు తండ్రి

నందిని లేఔట్ లో నివాసం ఉంటున్న శంకర్ కు కుమార్తె అమల, కుమారుడు యష్ పాల్ ఉన్నారు. శంకర్ సుంకదకట్టలోని హేర్ డ్రెసెస్ షాప్ లో పని చేస్తున్నాడు. శంకర్ ప్రతిరోజూ మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. రోజూ మద్యం మత్తులో ఇంటికి వెళ్లే శంకర్ కుమార్తె అమల, కుమారుడు యష్ పాల్ కు నరకం చూపించేవాడు.

చిత్రహింసలు తట్టుకోలేని కుమార్తె

చిత్రహింసలు తట్టుకోలేని కుమార్తె

యలహంకలోని ప్రైవేట్ కంపెనీలో అమల ఉద్యోగం చేస్తున్నది. రోజూ తండ్రి శంకర్ మద్యం మత్తులో ఇంటికి వచ్చి నానా మాటల అనడంతో అమల సహించలేకపోయింది. అయినా ఇంత కాలం అమల ఓపికగా ఉండేది. అయితే తండ్రి శంకర్ చిత్రహింసలు ఎక్కువ కావడంతో అమల తట్టుకోలేకపోయింది.

వేరుగా ఉంటేనే మేలు

వేరుగా ఉంటేనే మేలు

తండ్రి చిత్రహింసలు తట్టుకోలేని అమల రాజీవ్ గాంధీ సర్కిల్ లోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలోని పెద్దనాన్న ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటోంది. కుమారుడు యస్ పాల్ మాత్రం తండ్రి శంకర్ తో కలిసి రాజీవ్ గాంధీ సర్కిల్ లోని ఇంటిలో నివాసం ఉంటున్నాడు.

నామాట వినకుంటే చంపేస్తా !

నామాట వినకుంటే చంపేస్తా !

తనమాట వినకుండా, తనతో కలిసి ఉండకుండా వేరుగా ఉంటే మిమ్మల్ని చంపేస్తానని శంకర్ ఇద్దరు బిడ్డలను హెచ్చరించాడు. అయితే మద్యం మత్తులో తండ్రి శంకర్ వాగుతున్నాడని అమల, యష్ పాల్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే కన్నతండ్రి శంకర్ అన్నంత పని చేస్తాడని వారు ఊహించలేకపోయారు.

ఇంటికి నిప్పంటించి !

ఇంటికి నిప్పంటించి !

మంగళవారం రాత్రి ఉద్యోగం నుంచి ఇంటికి వచ్చిన అమల భోజనం చేసింది. అదే సమయంలో యష్ పాల్ కూడా అమల ఉంటున్న పెద్దనాన్న ఇంటికి వెళ్లి భోజనం చేసి నిద్రపోయాడు. రాత్రి అందరూ నిద్రపోతున్న సమయంలో శంకర్ వారు ఉంటున్న కిటికిలో, తలుపు సందుల్లో పెట్రోల్ పోసి నిప్పంటించి వారిని సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఇంటికి నిప్పంటుకుందని గ్రహించిన అమల, యష్ పాల్ గట్టిగా కేకలు వెయ్యడంతో ఇరుగు పొరుగు వారు మంటలు అదుపు చెయ్యడంతో ఇద్దరు ప్రాణాలతో భయపడ్డారు. ఇంటికి నిప్పంటించి బిడ్డలను సజీవదహనం చెయ్యడానికి ప్రయత్నించి పరారైన శంకర్ ను బుధవారం నందిని లేఔట్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+