Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కొడుకును తుపాకితో కాల్చి చంపేసిన తండ్రి, పెళ్లి చెయ్యాల్సిన కొడుకును పాడ ఎక్కించాడు!

వివాహం చేసుకున్న దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. సొంత ఊరిలో కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన దంపతులు తరువాత కుమారుడితో కలిసి సిటీకి వెళ్లారు. ఉద్యోగం చేస్తున్న భర్త మద్యం సేవించడానికి బానిస అయ్యాడు. కొడుకు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇదే సమయంలో తండ్రి ఇంట్లో అతని కొడుకును తుపాకితో కాల్చి చంపేయడం కలకలం రేపింది.

సురేష్ (52) అనే వ్యక్తి బెంగళూరు నగరంలోని కామాక్షిపాళ్యంలోని కెరెకల్లిలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం చేసే సురేష్‌కు మద్యం తాగే అలవాటు ఎక్కువగా ఉండేది. డబ్బులు ఇవ్వకపోవడంతో కొడుకును హత్య చేశాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వాలని కొడుకును చిత్రహింసలకు గురి చేస్తున్న సురేష్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన కొడునున తుపాకితో కాల్చి చంపేశాడు.

A father shot his son dead with a double barrel gun in Bengaluru city

కర్ణాటకలోని కొడగుకు చెందిన సురేష్ కొన్నేళ్ల క్రితం బెంగళూరు నగరానికి చేరుకుని కామాక్షిపాళ్యలో నివసిస్తున్నాడు. సురేష్ భార్య అనారోగ్యంతో బాధపడుతున్నది. చాలాకాలంగా బెడ్ కే పరిమితం అయిన సురేష్ భార్య ఏపని చెయ్యలేకపోతోంది. సురేష్ కొడుకు నర్తన్ భూపన్న అలియాస్ నర్తన్ ఉద్యోగం చేస్తూ అతని తల్లిని చూసుకుంటున్నాడు. మద్యానికి బానిసైన సురేష్ సెక్యూరిటీగార్డుగా ఉద్యోగం చేస్తూ వచ్చిన జీతం మద్యం సేవించడానికి ఖాళీ చేస్తున్నాడు.

నెల చివరిరోజులు కావడంతో సురేష్ చేతిలో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయింది. శుక్రవారం సురేష్ ఇంట్లోనే ఉన్నాడు. ఇంటికి వచ్చిన కొడుకు నర్తన్ ను తనకు డబ్బులు ఇవ్వాలని సురేష్ అడిగాడు. అమ్మ మందులు కొనడానికి డబ్బులు సరిపోతున్నదని, నీకు మద్యం సేవించడానికి తాను డబ్బులు ఇవ్వలేనని నర్తన్ అతని తండ్రి సురేష్ కు తేల్చిచెప్పాడు. ఇదే విషయంలో తండ్రీకొడుకులు చాలాసేపు గొడవ పడ్డారు.

చివరికి విసిగిపోయిన నర్తన్ తాగుడుకు డబ్బులు ఇవ్వాలంటూ చిత్రహింసలకు గురిచేస్తున్న తండ్రి సురేష్ ను ఓ గదిలో పెట్టి బయట తాళం వేశాడు. గదిలో బంధించడంపై ఆగ్రహించిన తండ్రి సురేష్ అదే గదిలో ఉన్న డబుల్ బ్యారల్ గన్‌తో ఆ గది డోర్‌పై కాల్పులు జరిపాడు. తలుపులో బుల్లెట్ చీల్చుకుంటూ బయటకు రావడంతో అదే తలుపు బయట నిలబడి ఉన్న నర్తన్ కాలి తొడలోకి దూసుకువెళ్లింది. తుపాకి తూటా దూసుకుపోవడంతో నర్తన్ కుప్పకూలిపోయాడు. మంచం మీద ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్న నర్తన్ తల్లి ఆర్తనాదాలు చేసింది.

విపరీతంగా రక్తస్రావం కావడంతో నొప్పి తట్టుకోలేని నర్తన్ అతని స్నేహితుడికి ఫోన్ చేసి మా నాన్న తుపాకితో నన్ను కాల్చేశాడు అని చెప్పాడు. స్నేహితులు, బంధువులు వచ్చి తీవ్రగాయాలైన నర్తన్ ను ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్కువ రక్తం పోవడంతో చికిత్స విఫలమై రాత్రి నర్తన్ మృతి చెందాడు. అదే సమయంలో నిందితుడు సురేష్ ఇంట్లోని రక్తాన్ని నీళ్లతో కడిగి సాక్ష్యాలను నాశనం చెయ్యడానికి ప్రయత్నించాడు.

కామాక్షిపాళ్య పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లో ఉన్న నిందితుడు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొడుకు నర్తన్ ను హత్య చేసిన అతని తండ్రి సురేష్ జైలుకు వెళ్లాడు. అనారోగ్యంతో బాధపడుతున్న అతని భార్య ఏం చెయ్యాలో తెలీక విలపిస్తున్నది. మద్యం తాగడానికి బానిస అయిన సెక్యూరిటీగార్డు విధులు నిర్వహించడానికి ఉపయోగించే డబుల్ బ్యారెల్ గన్ తీసుకుని కన్న కొడుకును కాల్చి చంపేయడం బెంగళూరులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+