నా కొడుకు ఇంట్లో ఏం చేస్తున్నాడో ?, స్కూల్ లో అమ్మాయిలను ఏం చేస్తున్నాడో మీకు తెలుసా ?

కొడుకు మొబైల్ ఫోన్‌లో అసభ్యకరమైన వీడియోలు చూస్తున్నాడన్న కారణంతో ఓ తండ్రి అతని కుమారుడికి విషమిచ్చి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో తన 14 ఏళ్ల కుమారుడికి విషమిచ్చి చంపిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. తన కొడుకు ఇంట్లో ఏం చేస్తున్నాడు ?, స్కూల్ లో అమ్మాయిలను ఏం చేస్తున్నాడు అని తండ్రి పూసగుచ్చినట్లు పోలీసులకు చెప్పాడు.

తన కొడుకును ఎందుకు హత్య చేశానో అనే విషయం తండ్రి చెప్పడం కలకలం రేపింది. కొడుకు అదృశ్యంపై కథ అల్లిన తండ్రి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అరెస్టు అయిన వ్యక్తిని విచారించిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. ఈ కేసులో విజయ్ బట్టు అలియాస్ విజయ్ అనే వ్యక్తిని నిందితుడిగా గుర్తించామని, హత్యకు గురైన బాలుడు విశాల్ అని షోలాపూర్ పోలీసులు తెలిపారు. నిందితుడు విజయ్ టైలర్‌గా పనిచేస్తున్నాడు. విజయ్ అతని భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి షోలాపూర్‌లో నివసిస్తున్నాడు. ఆనందంగా జీవితం గడుపుతున్న ఈ కుటుంబంలో కుమారుడు విశాల్ ప్రవర్తన కలకలం రేపింది.

A father who watched porn videos at home every day and killed his son who was harassing girls at school in Maharashtra.

జనవరి 13వ తేదీన విశాల్ అనే 14 ఏళ్ల బాలుడు కనిపించడం లేదంటూ షోలాపూర్ పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలుడు విశాల్ తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి బాలుడి కోసం గాలించారు. ఈ సమయంలో ఓ బాలుడి మృతదేహం లభ్యమైంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విశాల్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆ తర్వాత మృతదేహం తప్పిపోయిన తమ కుమారుడు విశాల్‌ దే అని అతని కుటుంబ సభ్యులు నిర్దారించారు.

విశాల్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే ముందే పోస్టుమార్టం నిర్వహించగా విషం తాగి ఆ బాలుడు మృతి చెందినట్లు వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. విశాల్ మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు హత్య కేసు నమోదు చేసి అతని కుటుంబ సభ్యులను విచారించారు. ఈ సమయంలో విశాల్ తండ్రి విజయ్ తీరుపై షోలాపూర్ పోలీసులకు అనుమానం వచ్చింది. తండ్రి విజయ్ తో కలిసి వెళ్లిన అతని కొడుకు విశాల్ తిరిగి వచ్చేసరికి అక్కడ లేడు. తండ్రి విజయ్ తో పాటు వెళ్లిన అతని కొడుకు విశాల్ కనిపించకుండా పోయాడని బాలుడి తల్లి పోలీసులకు చెప్పింది.

A father who watched porn videos at home every day and killed his son who was harassing girls at school in Maharashtra.

విశాల్ తండ్రి విజయ్ ని పలు రకాలుగా పోలీసులు విచారించారు. ఆ సమయంలో నిందితుడి విజయ్ బట్టు అలియాస్ విజయ్ తన కొడుకు విశాల్ ను తానే హత్య చేసినట్లు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. 14 ఏళ్ల కొడుకు హత్యకు కారణమేంటి అని అసలు మ్యాటర్ తెలుసుకున్న షోలాపూర్ పోలీసులు హడలిపోయారు. తన కొడుకు విశాల్ కు 14 ఏళ్లు అని, అతను ప్రతిరోజూ ఇంట్లో గంటలు గంటలు మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూసేవాడని, తల్లిదండ్రులు చెప్పిన మాట ఏమీ వినడం లేదని, స్కూల్‌లో అమ్మాయిలను ఆటపట్టించేవాడని, పాఠశాల నుంచి ఇదే విషయంలో తరచుగా ఫిర్యాదులకు దారితీసిందని విజయ్ పోలీసులకు చెప్పాడు.

కొడుకు విశాల్ దారితప్పుతున్నాడని తెలిసి చాలాసార్లు పద్దతి మార్చుకోవాలని తాము సలహా ఇచ్చామని, ఎంత చెప్పినా నా కొడుకు మాట వినడం లేదని గ్రహించి అతన్ని హత్య చేయాలని ప్లాన్ వేసినట్లు విజయ్ నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. జనవరి 13వ తేదీన కుమారుడు విశాల్ ను బైక్ లో తుల్జాపూర్ రోడ్డుకు తీసుకెళ్లిన విజయ్ కూల్ డ్రింక్ కొని అందులో విషం కలిపి ఇచ్చాడని, ఆ కూల్ డ్రింక్ తాగిన వెంటనే విశాల్ స్పృహ కోల్పోయి మరణించాడని, తరువాత విజయ్ అతని కొడుకు మృతదేహాన్ని అక్కడే వదిలి ఇంటికి తిరిగి వచ్చాడని షోలాపూర్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+