ఓ వివాహ వేడుకలో స్వీట్ కోసం ఫైట్...
పెళ్లిళ్ల అంటే సహజంగానే హడావిడి మాములుగా ఉండదు. బంధువుల సందడి, చిన్నారుల అల్లర్లతో పెళ్లి మండపాలు కోలాహాలంగా మారుతుంటాయి. పెళ్లివేడుకల్లో మాములుగానే వెరైటీ రుచుల వంటకాలు ఉంటాయి. పెళ్లిళ్లలో చిన్నచిన్నగొడవలు మాములే. ఎందుకంటే అందరూ ఒకేచోట కలవడంతో చిన్నపాటి మనస్పర్థలు వస్తుంటాయి. కానీ, అవి కొన్ని సందర్భాల్లో పెద్దపెద్ద గొడవలకు దారితీస్తాయి. అలాంటి ఘటనే ఒకటి తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కానీ, ఈ పెళ్లి వేడుకలో మాత్రం ఏకంగా ఓ స్వీట్ కోసం యుద్ధమే జరిగింది. ఒకరినొకరు ఘోరంగా కొట్టుకున్నారు.
ఆగ్రాలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అర్థరాత్రి ఓ వివాహ వేడుకలో రసగుల్లాల కోసం కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరుకుటుంబాల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఈ పెళ్లి వేడుక కాస్త రక్తసిక్తంగా మారింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఆరుగురికి తీవ్ర గాయాలయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివాదానికి గల కారణాలు తెలుసుకుని నిర్థాంతపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

రసగుల్లా స్వీట్‌పై గొడపడ్డ ఇరు కుటుంబాల వారు...
శంషాబాద్ పట్టణంలోని నయావాస్ రోడ్డులోని బ్రిజ్భాన్ కుష్వాహా ఇంట్లో పెళ్లి వేడుక జరిగింది. వివాహ విందులో రసగుల్లా తినే విషయంలో రెండు కుటుంబాల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అయితే, ఈ వివాదంలో చిక్కుకున్న మరో వ్యక్తి మనోజ్ కుమారుడు గౌరీశంకర్ శర్మ మరో ముగ్గురితో కలిసి పెళ్లి మండపానికి చేరుకున్నారు. విందు సందర్భంగా రసగుల్లా తినడంపై వాగ్వాదం జరిగినట్లు చెప్పారు. మాటలతో మొదలైన వాగ్వాదం తీవ్ర గొడవకు దారితీసింది.
ఈ క్రమంలోనే ఇరువర్గాల వారు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో బ్రిజ్భన్ సింగ్ భార్య భగవాన్ దేవి, బ్రిజ్భన్ సింగ్ కుమారుడు యోగేష్ గాయపడగా, మరోవైపు మనోజ్, కైలాష్ కుమారులు గౌరీ శంకర్ శర్మ, ధర్మేంద్ర కుమారుడు రమేష్ శర్మ, పవన్ కుమారుడు గౌరీ శంకర్ తీవ్రంగా గాయాలపాలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications