టెక్కీ హత్య: గాలింపునకు మానవరహిత వాహనం

Tamil Nadu police use UAV in murder probe
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై ఐటి కారిడార్‌లో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ (23) హత్య కేసులో దేశంలోనే తొలిసారిగా మానవేతర వాహనాన్ని(యూఏవి) పోలీసులు ఉపయోగించారు. నగరంలోని టాటా కన్సల్టెన్సీ సర్వీస్‌లో పని చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఉమా మహేశ్వరి 10 రోజుల క్రితం అదృశ్యమైంది. ఫిబ్రవరి 13న అదృశ్యమైన ఆ టెక్కీ మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు.

నగరంలోని ఐటి కారిడార్ సిరుసెరి సమీపంలో ఉమా మహేశ్వరి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సిబి-సిఐడి ఆదివారం, సోమవారం రోజుల్లో దట్టమైన పొదలు అలుముకున్న ప్రాంతాల్లో హత్యకు గల ఆధారాలను ఈ మానవేతర వాహనంతో గాలింపు చర్యలు చేపట్టారు. దట్టమైన పొదలు అలుముకున్న ఆ ప్రాంతంలో వాహనం ద్వారా పరిశీలించారు.

తమిళనాడు డిజిపి రామానుజన్ ఈ పరికరాలను ఉపయోగించేందుకు అనుమతించడంతో టెక్కీ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు ఉపయోగించారు. ఈ పరికరం సహాయంతో పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించారు. పోలీసులు గత అక్టోబర్‌లో ఓసారి కూడా ఈ యూఏవి వాహనాన్ని మధురైలో నిర్వహిస్తున్న మైనింగ్ కార్యకలాపాలను గుర్తించేందుకు ఉపయోగించారు. పలు నేరాల్లో ఆధారాలు సేకరించేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏరో స్పేసింగ్ ఇంజిరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంథిల్ కుమార్ తెలిపారు.

కాగా ఇలాంటి మూడు యూఏవి వాహనాలను కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 90 లక్షలు వెచ్చించేందుకు డిజిపి సుముఖత వ్యక్తం చేశారని సెంథిల్ కుమార్ తెలిపారు. తమ వద్ద రెండు వాహనాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఒక చదరపు కిలో మీటరు పరిధిలోని అంశాలను ఈ వాహనం పరిశీలించగలదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+