సాఫ్ట్ వేర్ కంపెనీలో బాంబు ఉంది, పరుగో పరుగు, మేడమ్ ఎంత పని చేసిందంటే ?, మ్యాటర్ !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో మారోసారి బాంబు బెదిరింపు ఫోన్ రావడంతో సాఫ్ట్ వేర్ కంపెనీ ఉద్యోగులు హడలిపోయారు. బెంగళూరులోని హోసూర్ రోడ్‌లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) థింక్ క్యాంపస్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. బాంబు బెదిరింపు కాల్ రావడంతో కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు బయటికి పరుగు తీశారని కన్నడ మీడియా తెలిపింది.
విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం హోసూరు రోడ్డులోని టీసీఎస్ కార్యాలయంలో పని చెయ్యడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, ఉద్యోగులు వెళ్లారు. తరువాత క్యాంపస్‌లోని బి బ్లాక్‌కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే సిబ్బంది పరప్ప అగ్రహార పోలీసులకు సమాచారం ఇచ్చారు. కార్యాలయంలో పని చేస్తున్న ఉద్యోగులు బయటకు పరుగుతీశారు.

విషయం తెలుసుకున్న పోలీసు అధికారులు టీసీఎస్ క్యాంపస్ కు చేరుకున్నారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ అధికారులు పేలుడు పదార్థాల కోసం టీసీఎస్ కార్యాలయం భవన సముదాయంలో సోదాలు ప్రారంభించారు. సోదాల తరువాత అదృష్టవశాత్తూ భవనం లోపల ఎలాంటి పేలుడు పదార్థాలు చిక్కలేదని తెలుసుకుని అక్కడ పని చేస్తున్న సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
ఉత్తుత్తి బాంబు ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అంటూ పోలీసులు ఆరా తీశారు. కర్ణాటకలోని హుబ్బళి జిల్లాకు చెందిన మాజీ మహిళా ఉద్యోగి బాంబు బెదిరింపు ఫోన్ చేసిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉద్యోగం నుంచి తొలగించినందుకు కోపంతోనే ఆమె ఈ బాంబు బెదిరింపు ఫోన్ చేసిందని పోలీసుల విచారణలో తేలింది. ఫోన్ చేసిన మహిళ కోసం పోలీసులు వెతకడం ప్రారంభించారు.
టీసీఎస్ క్యాంపస్ కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ రావడం ఇదే మొదటిసారి కాదు. 2023 మేలో హైదరాబాద్‌లోని టీసీఎస్ క్యాంపస్‌కు ఫేక్ బాంబ్ కాల్ రావడంతో 1,500 మంది ఉద్యోగులను క్యాంపస్ నుంచి ఖాళీ చేయించారు. హైదరాబాద్ క్యాంపస్‌లో బెంగుళూరుకు చెందిన మాజీ టీసీఎస్ ఉద్యోగి నుండి వచ్చింది, అతను సెక్యూరిటీ విభాగంలో ఉద్యోగం చేసేవాడు.
ఉద్యోగం నుండి తీసేశారనే కోపంతో అతను ఉత్తుత్తి బాంబు బెదిరింపు ఫోన్ చేశాడు. ఇప్పుడు బెంగళూరులో ఉద్యోగం నుంచి తీసేశారనే కోపంతో మహిళా ఉద్యోగి నకిలి బాంబు బెదిరింపు ఫోన్ చేసిందని తెలుసుకున్న పోలీసులు ఆమె కోసం గాలించారు. అయితే బెళగావిలో తలదాచున్న మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని కన్నడ మీడియా తెలిపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications