వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సినిఫక్కీలో పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసిన క్రిమినల్స్..! లాకప్‌లో ఉన్న నిందితుడితో పరార్...!

|
Google Oneindia TeluguNews

కరుడు గట్టిన క్రిమినల్స్‌ను, గ్యాంగ్ లీడర్ లను పోలీసులు అరెస్ట్ చేస్తారు. పూర్తి బందోబస్తు మధ్య స్టేషన్‌లో బందిస్తారు. ఇంతలోనే గ్యాంగ్‌స్టర్‌కు చెందిన గ్యాంగ్ వెంటనే పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి అవసరమైతే అడ్డువచ్చిన పోలీసులను చితకబాది, కాల్పులు జరిపి స్టేషన్‌లో ఉన్న తమ అనుచరుడిని దర్జాగా విడుపించుకుపోతారు. ఇక వెళుతూ..వెళుతూ.. తమ వెంట రాకుండా స్టేషన్‌లో ఉన్న వాహనాలను తగులబెట్టి, మరోవాహానాన్ని తమ వెంట తీసుకెళతారు. ఇది బాలివుడ్, టాలివుడ్ సినిమలలో నిత్యం కనిపించే సీన్స్...

సినిఫక్కిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి

సినిఫక్కిలో పోలీస్‌స్టేషన్‌పై దాడి


అయితే ఇలా సినిమాలోనే నిజంగా బాలివుడ్ సినిమాను తలపించే సీన్ రాజస్థాన్‌లోని అళ్వార్ జిల్లాకు చెందిన పోలీస్ స్టేష‌లో జరిగింది. ఓ కానిస్టేబుల్ హత్యకేసులో హర్యాణకు చెందిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా ఉన్న గుర్జార్ నిందితున్ని పోలీసులు గురువారం అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో గుర్జార్ గ్యాంగ్ ఆయన్ను విడిపించేందుకు రెక్కి నిర్వహించింది. దీంతో ఇరవై మంది వరకు గ్యాంగ్ ఏకే 47లతో స్టేషన్‌లోకి ప్రవేశించారు. అనంతరం 40 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. తాపిగా పోలీసుల కస్డడిలో ఉన్న గుర్జార్‌ను విడిపించుకుని తాపిగా తీసుకువెళ్లారు.

క్రిమినల్‌‌ను తాపిగా తీసుకెళ్లిన గ్యాంగ్

క్రిమినల్‌‌ను తాపిగా తీసుకెళ్లిన గ్యాంగ్

అయితే తమ వెంట తీసుకు వచ్చిన వెహికిల్ కొంత దూరం వెళ్లిన తర్వాత ఆగిపోవడంతో వెంటనే అక్కడ ఉన్న మరో వెహికిల్‌‌కు తుపాకి గురి పెట్టి అందులో ఎక్కి పారిపోయారు. అయితే అందులో కూడ ఇరవై మంది క్రిమినల్స్ పట్టకపోవడంతో మరో స్కార్పియోను కూడ తీసుకుని హర్యాణవైపు పారిపోయినట్టు జిల్లా ఎస్పి తెలిపారు.అయితే పోలీసులు వారిని వెంబడించినప్పటికి తప్పించుకుని పారిపోయారని రాజస్థాన్ డీజీపీ భూపేంద్ర యాదవ్ తెలిపాడు. నిందుతులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.

ఐదు హత్యకేసులు,5 లక్షల రివార్డు

ఐదు హత్యకేసులు,5 లక్షల రివార్డు

అయితే గుల్జార్, హర్యాణకు చెందిన డా,కుల్దీప్ గ్యాంగ్‌కు చేందిన వాడుగా పోలీసులు తెలిపారు. కాగా ఓ కానిస్టేబుల్ హత్య కేసులో గుల్జార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. దీంతో పాటు ఐదు హత్యకేసులు నమోదు కావడంతో అయిదు లక్షల రుపాయల రివార్డు కూడ ఉన్న హర్యాణలోని బెహ్‌రార్ జిల్లా బెహరార్ పోలీసులు తెలిపారు. అయితే అదే సంధర్భంలో రాష్ట్రంలోని శాంతిభద్రత పరిస్థితిపై సీఎం అశోక్‌ గెహ్లాట్ ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తున్న సమయంలోనే ఆయనకు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని చేరవేయడం గమనార్హం.

English summary
a gang of criminals, armed with AK-47s rifles, stormed a police station in Rajasthan’s Alwar district and freed one of Haryana’s most wanted criminals from the lock-up.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X