నోట్లో గుడ్డలు కుక్కి యువతిపై ఇద్దరు పిల్లల తండ్రి రేప్

Subscribe to Oneindia Telugu

గురుదాస్ పూర్: పంజాబ్ రాష్ట్రంలోని గురుదాస్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిపై ఇద్దరు పిల్లలకు తండ్రి ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొందంటూ బెదిరింపులకు గురిచేశాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గురుదాస్‌పూర్ జిల్లా బదోష్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి ఇంటర్మీడియెట్ చదివే కూతురిని ఇంట్లో ఒంటరిగా వదిలి తన సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి వెళ్లారు.

A girl allegedly raped in Gurdaspur

బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించిన ఇద్దరు పిల్లల తండ్రి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించి యువతి నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం జరిపాడు. బాధిత యువతి అలారం మోగించేందుకు యత్నించినా దాన్ని ఆపివేసి అత్యంత దారుణంగా అత్యాచారం చేశాడు.

అంత్యక్రియల నుంచి తిరిగివచ్చిన తల్లిదండ్రులకు బాధిత యువతి జరిగిన దారుణం తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతిని వైద్యపరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl allegedly raped in Gurdaspur in Punjab.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి