చెరుకుతో 30 అడుగుల శ్రీ వినాయకుడు, 4 వేల కేజీల లడ్డు, గణపయ్యకు ప్రత్యేక పూజలు!
బెంగళూరు: వినాయక చవితి సందర్బంగా బెంగళూరు నగరంలోని జేపీ నగరలోని పుట్టేనహళ్ళిలో శ్రీసత్య సాయి గణపతి ఆలయంలో 50 టన్నుల చెరుకుతో వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. చెరుకుతో తయారు చేసిన వినాకుడికి పరిసర స్నేహి అని నామకరణం చేసి 4 వేల కేజీల లడ్డు నైవేధ్యంగా పెట్టి భక్తిశ్రద్దలతో పూజలు చేశారు.
శ్రీ సత్య సాయి గణపతి దేవాలయంలో చెరుకుతో తయారు చేసి వినాయకుడి విగ్రహం ముందు 4 వేల కేజీలతో ప్రత్యేకంగా లడ్డు తయారు చేసి పెట్టారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి వైవిద్యంగా నిర్వహించడం శ్రీ సత్య సాయి వినాయక ఆలయ కమిటీ నిర్వహకుల అనవాయితి.

50 టన్నుల చెరుకు
వినాయక చవితి సందర్బంగా శ్రీ సత్య సాయి వినాయకుడి ఆలయం దగ్గర 50 టన్నుల చెరుకుతో 30 అడుగుల ఎత్తు వినాయకుడి విగ్రహాన్ని తయారు చేశారు. పరిసరాలకు ఎలాంటి హాని కలగకూడదని చెరుకుతో వినాయకుడి విగ్రహం తయారు చేశారు. 50 మంది నిపుణులు కొన్ని రోజులు పగలు రాత్రి శ్రమించి చెరుకుతో వినాయకుడి విగ్రహాన్ని వైవిధ్యంగా, అందంగా తయారు చేశారని ఆలయం కమిటీ నిర్వహకులు తెలిపారు.

4 వేల కేజీల లడ్డు
వినాయక చవితి సందర్బంగా శ్రీ సత్య సాయి వినాయకుడి ఆలయంలో వినాయకుడి చెరుకు విగ్రహం ముందు 4 వేల కేజీలతో లడ్డు తయారు చేశారు. వెయ్యి కేజీల వేరుశెనగ పప్పుల పొడి, 2 వేల కేజీల చక్కెర, 700 కేజీల సన్ ఫ్లవర్ నూనె, 300 కేజీల నెయ్యి, 50 కేజీల జీడిపప్పు, 50 కేజీల ఎండు ద్రాక్ష, 5 కేజీల సుగంధ ద్రవ్యాలతో 4 వేల కేజీల లడ్డు తమారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టామని ఆలయం కమిటీ సభ్యులు తెలిపారు.

ఖైరతాబాద్ స్పూర్తి
హైదరాబాద్, ముంబై తదితర చోట్ల వినాయక చవితి సందర్బంగా భారీ లడ్డులు తయారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టడం ఆనవాయితి. గత ఏడాది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో వినాయక చవితి సందర్బంగా 4 వేల కేజీల లడ్డు తయారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టారు. ఖైరతాబాద్ లడ్డును స్పూర్తిగా తీసుకుని బెంగళూరులో మొదటి సారి 4 వేల కేజీల లడ్డు తయారు చేసి వినాయకుడికి నైవేధ్యంగా పెట్టామని ఆలయం కమిటీ నిర్వహకులు అంటున్నారు.

భక్తుల ప్రత్యేక పూజలు
జేపీ నగర్ లోని పుట్టేనహళ్ళిలోని శ్రీ సత్య సాయి వినాయకుడి ఆలయంలో ఏర్పాటు చేసిన 30 అడుగుల చెరుకు వినాయకుడిని చూడటానికి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నిలువెత్తు వినాయకుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

బెంగళూరులో ఫస్ట్
బెంగళూరు నగరంలో వినాయక చవితి సందర్బంగా మొదటి సారి 4 వేల కేజీలతో భారీ లడ్డు తయారు చేసి స్వామి వారికి నైవేధ్యంగా పెట్టారు. బెంగళూరు నగరంలో ఇంత భారీ లడ్డును తయారు చెయ్యడం ఇదే మొదటి సారి అని స్వామి వారి భక్తులు అంటున్నారు. మొత్తం మీద 30 అడుగుల ఎత్తులో చెరుకుతో తయారు చేసిన వినాయకుడి విగ్రహం, 4 వేల కేజీల వినాయకుడి విగ్రహం భక్తులను ఆకర్షిస్తున్నది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications