వీడియో: ట్రెక్కర్ల తాట తీసిన రైల్వే సిబ్బంది
బెంగళూరు: దూధ్ సాగర్. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత సుందరమైన జలపాతం. కర్ణాటక- గోవా సరిహద్దుల్లో ఉంటుంది ఈ వాటర్ ఫాల్స్. కేరళ నుంచి మహారాష్ట్ర వరకు విస్తరించిన పశ్చిమ కనుమల్లో.. 310 అడుగుల ఎత్తు నుంచి మాండోవి నదీ జలాలు కిందికి పారుతుంటాయి. పాల నురగల్లా కనిపిస్తుండటం వల్ల దీనికి దూధ్ సాగర్ అని పేరు.
వీడియో: ట్రెక్కర్ల తాట తీసిన రైల్వే సిబ్బంది#viralvideo pic.twitter.com/E8RcTgiv2A
— oneindiatelugu (@oneindiatelugu) July 16, 2023
ఒకవంక జలపాతం.. దానికి ఆనుకుని బెంగళూరు- పనాజీలను కలిపే రైల్వే ట్రాక్.. చుట్టూ దట్టమైన అడవులు, కంటికి కనిపించినంత మేర పరచుకున్న పచ్చదనంతో.. ఓ అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంటుంది ఈ ప్రదేశం. దీన్ని తిలకించడానికి ఏటా వందల సంఖ్యలో పర్యటకులు దూధ్ సాగర్‌కు చేరుకుంటుంటారు. ట్రెక్కింగ్ ఆనందాన్ని ఆస్వాదిస్తుంటారు.

రుతు పవనాల ప్రభావంతో ఎగువన కురుస్తోన్న భారీ వర్షాల వల్ల ప్రస్తుతం దూధ్ సాగర్ వాటర్ ఫాల్స్ పోటెత్తుతోంది. దీన్ని తిలకించడానికి వందలాది మంది ట్రెక్కర్లు ఇవ్వాళ దూధ్ సాగర్ వద్దకు చేరుకున్నారు. సాధారణంగా ఇక్కడికి వెళ్లాలనుకునే వారు సమీపంలో ఉన్న కొల్లెం రైల్వే స్టేషన్‌లో దిగుతుంటారు. దూధ్ సాగర్ వాటర్ ఫాల్స్‌కు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ రైల్వే స్టేషన్.
ఇక్కడ దిగి మళ్లీ ఆరు కిలోమీటర్ల దూరం కాలి నడకన వెళ్లాల్సి ఉంటుంది ట్రెక్కర్లు, పర్యాటకులకు. ఈ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది ట్రెక్కర్లు.. దూధ్ సాగర్ వద్దే రైలును నిలిపివేసే ప్రయత్నం చేశారు. పదుల సంఖ్యలో పట్టాలపై నిల్చున్నారు. వర్షం పడుతున్నా వారు లెక్కచేయలేదు.

దీనికి సమీపంలోనే ఉన్న మైనాపి వాటర్ ఫాల్స్‌ను సందర్శించడానికి వెళ్లిన ఇద్దరు పర్యాటకులు ప్రమాదానికి గురై మరణించడం, దూధ్ సాగర్ పోటెత్తుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ట్రెక్కింగ్‌ను నిలిపివేశారు. వాటర్ ఫాల్స్ పైకి వెళ్లడానికి ఎవర్నీ అనుమతి ఇవ్వట్లేదు. ఇది ట్రెక్కర్ల ఆగ్రహానికి కారణమైంది.
నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్‌ను పట్టాలపైనే నిల్చుని రైలును ఆపివేసే ప్రయత్నం చేశారు. ఈ సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారిని పట్టాల మీది నుంచి చెదరగొట్టారు. రైళ్ల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేసిన నేపథ్యంలో వారికి పనిష్మెంట్ ఇచ్చారు. వర్షంలోనే గుంజీలు తీయించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications