మహిళా టీచర్ ను చితకబాదిన హెడ్ మాస్టర్
జాయ్ నగర్: విద్యార్థులకు బుద్ధిమాటలు చెప్పి స్కూల్ లో అందరికి ఆదర్శంగా ఉండవలసిన హెడ్ మాస్టర్ సహనం కొల్పోయి సాటి మహిళా టీచర్ ను పట్టుకుని అందరి ముందు చితకబాదాడు. చివరికి విద్యార్థులు ఆందోళనకు దిగడంతో పోలీసులు హెడ్ మాస్టర్ ను అరెస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్ లోని 24 పార్గనాస్ జిల్లా జాయ్ నగరలో శ్రీకృష్ణ నగర్ హై స్కూల్ లో అశోక్ నస్కర్ హెడ్ మాస్టర్ గా పని చేస్తున్నాడు. ఇదే స్కూల్ లో సస్వతి కుందు అనే మహిళ లెక్కలు టీచర్ గా పని చేస్తున్నారు. కొంత కాలం నుండి స్పెషల్ క్లాస్ లు తీసుకునే విషయంలో టీచర్ల మధ్య విభేదాలు వచ్చాయి.

గురువారం స్పెషల్ క్లాస్ లు తీసుకోవాలని హెడ్ మాస్టర్ అశోక్ నస్కర్ మహిళా టీచర్ సస్వతి కుందుకు చెప్పారు. అందుకు ఆమె నిరాకరించారు. సహనం కొల్పోయిన అశోక్ నస్కర్ స్టాఫ్ రూంలో సస్వతి కుందు చెంప చెల్లుమనిపించాడు.
అంతటితో శాంతించకుండ ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లాడు. తరువాత ఆమె మొబైల్ తీసుకుని నేలకేసికొట్టాడు. విషయం తెలుసుకున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. సస్వతి కుందు ఫిర్యాదు చెయ్యంతో పోలీసులు అశోక్ నస్కర్ ను అరెస్టు చేశారు. సస్వతికి ఆసుపత్రిలో చికిత్స చేయించామని పోలీసులు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications