కుప్పకూలిన హెలికాప్టర్: ఏడుగురి సజీవదహనం
శ్రీనగర్: ప్రసిద్ది చెందిన వైష్ణోదేవి ఆలయంలో దైవదర్శనం చేసుకోవడానికి బయలుదేరిన భక్తులు హెలికాప్టర్ ప్రమాదంలో సజీవదహనం అయిన సంఘటన జమ్మూ కాశ్మీర్ లో జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన భక్తుల వివరాలు సేకరిస్తున్నామని అధికారులు తెలిపారు.
జమ్మూ నుంచి ప్రతి రోజు కాట్రాకు సమీపంలోని వైష్ణోదేవి ఆలయం దగ్గరకు హెలికాప్టర్ సర్వీసులు ఉన్నాయి. ఎప్పటిలాగే సోమవారం ఐదు మంది భక్తులతో కలిసి ఇద్దరు సిబ్బంది జమ్మూ నుంచి వైష్ణోదేవి ఆలయం దగ్గరకు బయలుదేరారు.

అయితే మార్గం మద్యలో మద్యాహ్నాం 12 గంటల సమయంలో కాట్రాకు సమీంలో హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్థానిక పోలీసులు, స్థానికులు ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించడానికి ప్రయత్నించి విఫలం అయ్యారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు సిబ్బందితో పాటు ఐదు మంది భక్తులు సజీవదహనం అయ్యారని పోలీసు అధికారులు చెప్పారు. మరణించిన భక్తుల వివరాలు సేకరిస్తున్నామని, హెలికాప్టర్ కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications