జైశ్రీరామ్, కుప్పకూలిన భారీ శ్రీరాముడి కటౌట్, ఐటీ హబ్ లో అర్దరాత్రి ఏం జరిగింది ?
దేశవ్యాప్తంగా శ్రీరామనామ జపం రోజురోజుకూ పెరుగుతోంది. అయోధ్యలోని రామమందిరంలో శ్రీరాముడిని ప్రతిష్ఠించారు. శ్రీరాముని దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి అయోధ్యకు లక్షలాది మంది భక్తులు వెళ్తున్నారు. అయోధ్యలో రాముడి దర్శనం చేసుకోవాలని కోట్లాది మంది హిందువులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది.
బెంగళూరు నగరంలోని నందిని లేఅవుట్ లోని కృష్ణానంద నగర్ సర్కిల్‌లో వేసిన 40 అడుగుల రాముడి కటౌట్ కుప్పకూలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత జరిగిన ఈ ఘటన రామభక్తులను కలచివేసింది. ఈ శ్రీరాముడి భారీ కటౌట్ ఎందుకు కిందకు పడిపోయింది అనేది ఇంకా తెలియరాలేదని స్థానికులు, పోలీసులు అంటున్నారు.

శ్రీరాముడి భారీ కటౌట్ సరిగ్గా కట్టినా ఎలా కింద పడింది ? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం చాలా ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా భక్తులు అయోధ్యకు శ్రీరాముడికి స్వాగతం పలికి పండుగను జరుపుకున్నారు. వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా రోడ్డు, వీధులు, సందులు అని తేడా లేకుండా దాదాపుగా అన్ని ఇళ్లుపై రాముడి ఫ్లెక్సీలు, బ్యానర్లు వేసి, జెండాలు కట్టి సంబరాలు చేసుకున్నారు.
ప్రత్యక్ష ప్రసారం ద్వారా అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అందరూ చూశారు. అంతేకాకుండా పలు చోట్ల భారీ కటౌట్లు కూడా వేశారు. అలాగే బెంగళూరులో వేసిన శ్రీరాముడి భారీ కటౌట్ కిందపడిపోవడంతో స్థానిక ప్రజలు హడలిపోయారు. అదృష్టవశాత్తూ కటౌట్ కుప్పకూలిపోయిన సమయంలో కింద ప్రజలు కాని, వాహనాలు కాని లేవని, దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.

అయితే ఈ కటౌట్ హఠాత్తుగా కుప్పకూలిపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు అంటున్నారు. కొందరు కావాలనే శ్రీరాముడి కటౌట్‌ను ధ్వంసం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అనంతరం స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. అంతేకాకుండా కటౌట్ పెట్టిన వారి సమాచారం కూడా రాబడుతున్నారు. త్వరలో నిజానిజాలు తెలుస్తాయని స్థానిక పోలీసు అదికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications