ఫ్రెండ్ భార్యను, కూతుర్ని ఏం చేశాడంటే ?, ఇద్దరిని, భర్తకు మండిపోయి బార్ అండ్ రెస్టారెంట్ లో ?

బెంగళూరు: చిన్ననాటి స్నేహితులు ఇప్పటికి కలిసి ఉంటున్నారు. ఇద్దరూ వివాహాలు చేసుకుని వేర్వేరు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఎవరి ఇళ్లల్లో శుభకార్యాలు, ఫంక్షలు జరిగినా ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెలుతున్నారు. ఇదే సమయంలో స్నేహితుడి భార్య మీద కన్ను వేసిన ఒకడు ఆమెను శారీరకంగా హింసించాడని తెలిసింది. ఇదే సందర్బంలో స్నేహితుడి కూతురితో కూడా అతను అసభ్యంగా ప్రవర్తించాడని తెలిసింది.

బెంగళూరు నగరంలోని కంగేరి ఉప నగరలో మాదేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కంగేరి సమీపంలోనే రాజ్ కుమార్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగిన రాజ్ కుమార్, మాదేశ్ బాల్యస్నేహితులు. చిన్ననాటి స్నేహితులు ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉండేవాళ్లు. చదువు మధ్యలో మానేసిన రాజ్ కుమార్, మాదేష్ తరవాత కారు డ్రైవింగ్ నేర్చుకున్నారు.

A husband killed his childhood friend in Bengaluru out of anger that he was physically torturing his wife

బెంగళూరులో రాజ్ కుమార్, మాదేష్ క్యాబ్ డ్రైవర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. రాజ్ కుమార్, మదేష్ ఇద్దరికి వివాహం అయ్యింది. మాదేష్ కంగేరి ఉపనగరలో, రాజ్ కుమార్ వేరే ప్రాంతంలో వారివారి కుటంబాలతో కలిసి నివాసం ఉంటున్నారు. మాదేష్ భార్య మీద రాజ్ కుమార్ కన్నుపడిందని తెలిసింది. మాదేష్ కు ఓ కుమార్తె కూడా ఉంది.

మాదేష్ భార్యను శారీరకంగా ఇబ్బంది పెడుతున్న రాజ్ కుమార్ ఇటీవల మాదేష్ కుమార్తెను కూడా రాజ్ కుమార్ శారీరకంగా హింసించాడని తెలిసింది. తన స్నేహితుడు రాజ్ కుమార్ తన భార్యతో అసభ్యంగా ప్రవర్థిస్తున్నాడని మాదేష్ కు తెలిసింది. మూడు రోజుల క్రితం కంగేరి ఉప నగరలోని మానస లేఔట్ లోని బార్ లో మాదేష్, రాజ్ కుమార్ ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.

A husband killed his childhood friend in Bengaluru out of anger that he was physically torturing his wife
ఆ సందర్బంలో నా భార్యతో నువ్వు ఎందుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నావు ? అంటూ మాదేష్ అతని స్నేహితుడు రాజ్ కుమార్ తో గొడవ పెట్టుకున్నాడు. ఆ సందర్బంలో ఇద్దరి మద్య మాటామాటా పెరిగింది. ఆ సమయంలో సహనం కోల్పోయిన మాదేష్ కత్తి తీసుకుని బార్ లోనే అతని ఫ్రెండ్ రాజ్ కుమార్ ను దారుణంగా పొడిచాడు.

తీవ్రగాయాలైన రాజ్ కుమార్ ను ఆసుపత్రికి తరలించడంతో చికిత్స విఫలమై చనిపోయాడు. రాజ్ కుమార్ సోదరుడు రవి ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి తప్పించుకుని పారిపోయిన మాదేష్ ను అరెస్టు చేశామని సోమవారం పోలీసులు తెలిపారు. భార్య, కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్న క్లోజ్ ఫ్రెండ్ ను అతని స్నేహితుడే హత్య చెయ్యడం కంగేరిలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+