Wife: ఐదు మంది భార్యలు, 20 నిద్రమాత్రలు ఇచ్చి భర్త మర్మాంగం కోసేసిన లాస్ట్ వైఫ్ !

భోపాల్: కుటుంబ సభ్యులు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న వ్యక్తి అతని భార్యతో కొంతకాలం కాపురం చేశాడు. తరువాత భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. భార్య దూరం కావడంతో మరో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య కూడా జెండా ఎత్తేసింది. మూడో పెళ్లి చేసుకుంటే ఆమె అతన్ని వదిలేసి వెళ్లిపోయింది. నాలుగో పెళ్లి చేసుకున్నా ఆమె కూడా అతనితో కాపురం చెయ్యలేదు. తరువాత ఓ మహిళను ఐదవ పెళ్లి చేసుకుని ఆమెతోనే ప్రస్తుతం కాపురం చేస్తున్నాడు. అయితే ఐదవ భార్య చేతిలో అతను దారుణ హత్యకు గురైనాడు. భర్తను చంపేసిన ఐదవ భార్య అతని మర్మాంగం కూడా కోసేయడం కలకలం రేపింది.

 భర్తను చంపేసిన ఐదవ భార్య

భర్తను చంపేసిన ఐదవ భార్య

మధ్యప్రదేశ్‌లోని సింగ్రులిలో ఐదవ భార్య గొడ్డలితో ఆమె భర్తను నరికి చంపింది. బీరేందర్ గుర్జార్‌ అనే వ్యక్తి అతని ఐదవ భార్య చేతిలో హత్యకు గురైనాడు. బీరేందర్ ను అతని ఐదవ భార్య, కాంచనాగుర్జార్ అలియాస్ కాంచనా యాదవ్ హత్య చెయ్యడంతో అందరూ హడలిపోయారు. బీరందన్ ను హత్య చేసిన కాంచనా అతని మృతదేహాన్ని మాయం చెయ్యడానికి అనేక ప్రయత్నాలు చేసి చివరికి నిర్జనప్రదేశంలో పడేసిందని పోలీసులు అన్నారు,

 కేసు పెట్టిన భార్య

కేసు పెట్టిన భార్య

బీరేందర్ మృతదేహాన్ని ఫిబ్రవరి 21వ తేదీన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరేందర్ ఛాతీ, మెడపై తీవ్రగాయాలైనాయని పోలీసులు గుర్తించారు. బీరేందర్ మృతదేహం స్వాధీనం చేసుకున్న తరువాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు బీరేందర్ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని అతని ఐదవ భార్య కాంచనా యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని పోలీస్ స్టేషన్ ఇంచార్జి అరుణ్ పాండే తెలిపారు.

 నా మొగుడిని నేనే చంపాను

నా మొగుడిని నేనే చంపాను

మృతుడు బీరేందర్ బంధువులు, స్నేహితులతో సహా అందరినీ పోలీసులు విచారించారు. ఈ విచారణలో మృతుడు బీరేందర్ ఐదవ భార్య కాంచనాను కూడా పోలీసులు విచారించారు. అయితే మొదట కాంచనా నోరు విప్పకపోవడంతో పోలీసులు పలురకాలుగా విచారించగా అసలు విషయం బయటపడింది.

నీ భర్తను ఎందుకు హత్య చేశావని పోలీసులు కంచనాను ప్రశ్నించగా తన భర్త డ్రగ్స్ బానిస అని, రోజూ మద్యం సేవించి ఇంటికి వచ్చి తనను వేధించి చిత్రహింసలు పెట్టేవాడని కాంచన యాదవ్ పోలీసుల ఎదుట అంగీకరించింది.

 20 నిద్రమాత్రలు ఇచ్చి భర్త మర్మాంగం కోసేసింది

20 నిద్రమాత్రలు ఇచ్చి భర్త మర్మాంగం కోసేసింది

హత్యకు ముందు ఫిబ్రవరి 21వ తేదీ రాత్రి కాంచనా ఆమె భర్త బీరేందర్ కు ఆహారంలో 20 నిద్రమాత్రలు కలిపి ఇచ్చింది. నిద్రమాత్రలు కలిపిన భోజనం తిన్న బీరేందర్ మత్తులోకి జారుకున్నాడు. హత్యకు ముందు భర్త బీరేందర్ పై పలుమార్లు గొడ్డలితో దాడి చేసి చివరకు పదునైన ఆయుధంతో అతడి మర్మాంగం కోసేసిన కాంచనా ఆమె కసి తీర్చుకుందని విచారణలో అంగీకరించిందిని పోలీసు అధికారులు తెలిపారు.

 నలుగురు భార్యలు పారిపోయింది అందుకేనా ?

నలుగురు భార్యలు పారిపోయింది అందుకేనా ?

బీరందర్ ను హత్య చేసిన అనంతరం కంచనా ఆమె భర్త మృతదేహాన్ని దుప్పటిలో తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసిందని, సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకే బట్టలు, చెప్పులు తగులబెట్టిందని పోలీసులు తెలిపారు. హత్యకు గురైన బీరేందర్ కు కాంచనా ఐదవ భార్య అని, గతంలో నలుగురు భార్యలు ఇతని వేధింపుల కారణంగా పెళ్లయిన కొంతకాలానికి అందరూ పారిపోయారని పోలీసులు అన్నారు. బీరేందర్ ను తానే హత్మ చేశానని కాంచనా అంగీకరించడంతో ఆమెను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరుపరిచామని సింగ్రులి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+