Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న భార్య, మటన్ మార్కెట్ భర్త ఏం చేశాడంటే ?, అర్దరాత్రి అంతా ఓకే !

భార్య అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం తెలుసుకున్న భర్త ఆవేదనతో కుమిలిపోయాడు. పద్దతి మార్చుకోవాలని భార్యకు చాలాసార్లు బుద్దిమాటలు చెప్పాడు. మొదటే మాంసం దుకాణం నడుపుతున్న భర్త ప్రతిరోజు లెక్కలేనన్ని గెర్రెలు, మేకలు కోస్తున్నాడు. అక్రమ సంబంధం పెట్టుకుని తన పరువు తీస్తున్న తన భార్యను కూడా ఇలాగే గొర్రెను కోసినట్లు కోసేయాలని భర్త చాలా కాలం నుంచి వేచి చూశాడు.

పశ్చిమ బెంగాల్‌లోని బెహలాకు చెందిన 41 ఏళ్ల వ్యక్తి రాత్రి అతని భార్యను గొంతు కోసి చంపడమే కాకుండా మరుసటి రోజు వరకు సైలెంట్ గా అతని పనులు అతను చేసుకున్నాడు. ఇంటి పని అంతా తానే పూర్తి చేసిన భర్త మరుసటి రోజు ఉదయం వంట చేసి పిల్లలకు పెట్టి వాళ్లను పాఠశాలకు పంపాడు. ఆ తర్వాత భర్త అతని భార్యను హత్య చేసిన విషయాన్ని పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. స్థానిక మీడియా నివేదికల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

A husband who killed his wife and slept next to the dead body for the whole night
కార్తీక్ దాస్ అలియాస్ కార్తీక్ అనే వ్యక్తి సంపతి అనే యువతిని చాలా సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కార్తీక్ దాస్, సంపతి దంపతులకు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. అర్దరాత్రి కార్తిక్ అతని భార్య సంపతిని ఆమె గొంతు కోసి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్న కార్తీక్ తరువాత పిల్లలు నిద్రపోతున్న రూమ్ లోకి వెళ్లాడు పక్కరూమ్ లో కార్తీక్ భార్య సంపతి శవం అలాగే ఉంది. ఎప్పటిలాగే మరుసటి రోజు ఉదయం నిద్రలేచిన కార్తీక్ తరువాత ఇంటి పనులు పూర్తి చేశాడు.

కూతురిని, కొడుక్కి టిఫిన్ తినిపించి వారిని రెడీ చేసి ఇద్దరిని బడికి పంపేందుకు సిద్దం అయ్యాడు. పొద్దున్నే నిద్రలేచి భోజనం సిద్ధం చేసిన కార్తీక్ అతని పిల్లలు ఇద్దరిని పాఠశాలకు పంపిన అనంతరం పోలీసులకు ఫోన్ చేసి తన భార్య సంపతిని తానే హత్య చేశానని సమాచారం ఇచ్చాడు. పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పిన తరువాత కార్తీక్ అతని భార్య సంపతి తల్లికి ఫోన్ చేసి పిల్లలను స్కూల్ నుంచి మీ ఇంటికి తీసుకెళ్లాలని చెప్పాడు.

పోలీసులు ఇంటికి చేరుకునే సమయానికే కార్తీక్ అతని పిల్లలకు అవసరమైన వస్తువులు, బట్టలు, డబ్బులు బ్యాగులో నింపాడు. పోలీసులు మహాబిర్తలాలోని న్యూ అలీపూర్ సమీపంలోని ఇంటికి చేరుకుని చూడగా కార్తీక్ దాస్ అలియాస్ కార్తీక్ అతని భార్య సంపతి మృతదేహం ముందు ప్రశాంతంగా కూర్చున్న విషయం గుర్తించి బిత్తరపోయారు. పోలీసుల కథనం ప్రకారం కార్తీక్‌కు అదే ప్రాంతంలో కిరాణా దుకాణం తోపాటు మాంసాహార దుకాణం ఉంది. కిరాణా షాపును కార్తీక్ భార్య సంపతి చూసుకుంటున్నది.

A husband who killed his wife and slept next to the dead body for the whole night

కార్తీక్ మంసాహారం దుకాణం చూసుకుంటున్నాడు. తన భార్య సంపతి వివాహేతర సంబంధం పెట్టుకుందని కార్తీక్ కు చాలా కాలం నుంచి అనుమానం వచ్చిందని, ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని పోలీసులు తెలిపారు. ఇదే విషయంలో రాత్రి గొడవ మరింత పెరిగింది. తరువాత ఆవేశానికి లోనైన కార్తీక్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. అయితే నా భార్య చేసిన తప్పుకు నేను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న కార్తీక్ అతని భార్యను చంపేయాలని అనుకున్నాడు.

తరువాత భార్య సంపతి గొంతు కోసి ఆమెను హత్య చేసిన తరువాత ఆమె శవాన్ని బెడ్ రూమ్ లో పెట్టి పైన దుప్పటి కప్పేశాడు. మీ అమ్మకు ఆరోగ్యం బాగాలేదని, ఆమె విశ్రాంతి తీసుకుంటున్నదని కార్తీక్ అతని పిల్లలకు చెప్పాడని పోలీసు అధికారులకు తెలిపారు. కార్తీక్ వాంగ్మూలాన్ని తీసుకుని దానిని పరిశీలిస్తున్నామని, కార్తీక్ పిల్లలను వారి అమ్మమ్మ నివాసానికి తీసుకెళ్లారా ?, లేదా అనేదానిని నిర్ధారించుకుంటున్నామని పోలీసులు తెలిపారు. పోలీసులు సంపతి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి నిందితుడు కార్తీక్ ను అదుపులోకి తీసుకుని అతని మీద హత్య కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+