నకిలి పత్రాలతో కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేసిన కేఏఎస్ అధికారి !
బెంగళూరు: కేఏఎస్ అధికారి తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్నాడు. తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్న ఆ కేఏఎస్ అధికారికి భూస్వాధీనం అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. భూస్వాధీనం అధికారిగా ఉన్న ఆ అధికారి చేతివాటం చూపించారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తి పేరుతో స్వాహా చేశారు.
కర్ణాటకకు చెందిన జే. ఉమేష్ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కేఏఎస్ అధికారిగా అయ్యాడు. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కడూరులో తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్నారు. కడూరులో తహసిల్దార్ గా ఉద్యోగం చేస్తున్న ఉమేష్ కు కారవారలో సీబార్డ్ నౌకాశ్రయం భూస్వాధీన అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

కేఏఎస్ అధికారి అయిన ఉమేష్ శక్తి వంచన లేకుండా పని చేస్తారని ఆయన పై అధికారులు అనుకున్నారు. అయితే కడూరు తాలుకాలోని ఉళ్లినాగూరు గ్రామంలోని సర్వే నెంబర్ 43లోని ఐదు ఎకరాల నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని హనుమంతయ్య అలియాస్ చిక్కన్న అనే ఆయన పేరు మీద ఖాతా, దానపత్రం, విక్రయ పత్రాలు అక్రమంగా తయారు చేసి కోట్ల విలువైన భూమిని స్వాహా చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 146 మంది తహసిల్దార్ లు ఒకేసారి, ఒకేరోజు బదిలి అయ్యారు.
తరువాత కేఏఎస్ అధికారి ఉమేష్ మీద ఆరోపణలు వచ్చాయి. అధికారుల విచారణలో కేఏఎస్ అధికారి ఉమేష్ గోల్ మాల్ వ్యవహారం బయటకు వచ్చింది. ఉమేష్ మీద చర్చలు తీసుకోవాలని చిక్కమగళూరు జిల్లా కలెక్టర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. కేఏఎస్ అధికారి ఉమేష్ తో పాటు తరికేరి డిప్యూటీ తహసిల్దార్ కాంతరాజ్, ఆర్ నంజుండయ్య, రెవెన్యూ అధికారి కిరణ్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని చిక్కమగళూరు జిల్లా కలెక్టర్ కడూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
కేసు నమోదు అయిన వెంటనే చిక్కమగళూరు జిల్లా నుంచి కేఏఎస్ అధికారి ఉమేష్ మాయం అయ్యాడు. అప్పటి నుంచి పోలీసులు ఉమేష్ కోసం గాలిస్తున్నారు. బెంగళూరులోని స్నేహితుల ఇంటిలో తలదాచుకున్న ఉమేష్ ను కడూరు పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో అరెస్టు చేసిన కేఏఎస్ అధికారి ఉమేష్ ను చిక్కమగళూరు పోలీసులు ఆయన్ను కడూరుకు పిలుచుకుని వెళ్లారు.












Click it and Unblock the Notifications