Viral Video: నీ పెతాపమో..నా పెతాపమో: పులి-పిల్లి ఫేస్ టు ఫేస్: తగ్గేదే లే
ముంబై: ఆగర్భ శతృత్వం గల ప్రాణులు ఈ భూమండలం మీద ఎన్నో ఉన్నాయి. వైల్డ్ యానిమల్స్, డొమెస్టిక్ యానిమల్స్ ఈ కేటగిరీ కిందికే వస్తాయి చాలావరకు. ఆజన్మ వైరం ఉంటుంది వాటి మధ్య. ఈ వైరాన్ని, శతృత్వాన్ని దాటుకుని రెండు వేర్వేరు జంతువులు, ఇతర ప్రాణులు తరచూ స్నేహంగా కలిసి పోవడాన్ని మనం చాలాసార్లు చూశాం. ఈ విచిత్ర స్నేహబంధానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ అవుతుంటాయి. అవన్నీ కొద్దిగా వింతగా అనిపిస్తుంటాయి.
ఇలాంటి వైషమ్యాలు ఉన్న చిరుత-పిల్లి ఫేస్ టు ఫేస్ ఎదురుపడితే ఎలా ఉంటుందనడానికి నిదర్శనం ఇప్పుడు మీరు చూస్తోన్న ఈ వీడియో. అనుకోకుండా చిరుత, పిల్లి రెండూ ఒకేసారి బావిలో పడ్డాయి. ఈ రెండు కూడా బయటికి వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. ఫేస్ టు ఫేస్ ఎదురు పడ్డాయి. మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో గల ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యవసాయ బావిలో పడ్డాయి ఈ రెండు జంతువులు.

తన కంటికి కనిపించిన పిల్లిని వెంటపడింది చిరుత. తన పంజా రుచిని చూపించాలని వెంటాడింది. ఆ ప్రయత్నంలో అనుకోకుండా ఈ రెండూ బావిలో పడిపోయాయి. ఆ తరువాత ఒకదానికొకటి ఎదురు పడ్డాయి. పిల్లి గురించి ఓ సామెతకు మనం చాలాసార్లు విన్నాం. గదిలో బంధించి కొట్టే ప్రయత్నం చేస్తే.. పిల్లి కూడా పులిలా మారి..తిరగబడుతుందనే సామెత మనకు తెలుసు. ఇప్పుడు ఈ సామెత ఈ బావిలో పడిన పిల్లికి అతికినట్టు సరిపోతుంది. చిరుత బారి నుంచి అప్పటికప్పుడు తప్పించుకునే మార్గం లేకపోవడం వల్ల.. ఆ పిల్లి.. పులిలా మారింది.
చిరుతను ఢీకొట్టే ప్రయత్నం చేసింది. తన మీదికి వచ్చిన పులిని చూసి ఏ మాత్రం వెనుకంజ వేయలేదు. తొణకలేదు..బెణకలేదు. ధైర్యంగా దాని ముందు నిల్చుంది. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చిరుత బావిలో పడిందనే సమాచారాన్ని తెలుసుకున్న వెంటనే స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఆ వ్యవసాయ బావి వద్దకు చేరుకున్నారు. చిరుతను బంధించి.. సమీప అడవుల్లో వదిలి వేసినట్లు నాసిక్ పశ్చిమ డివిజన్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ పంకజ్ గర్గ్ తెలిపారు.
#WATCH | Maharashtra: A leopard and a cat come face-to-face after falling down a well in Nashik
— ANI (@ANI) September 6, 2021
"The leopard fell in the well while chasing the cat. It was later rescued and released in its natural habitat," says Pankaj Garg, Deputy Conservator of Forests, West Nashik Division pic.twitter.com/2HAAcEbwjy












Click it and Unblock the Notifications