స్టేషన్‌లో ఆగిన రైలు... సిగ్నల్ పడినా దూసుకొచ్చిన మరో రైలు...ఆ తర్వాత...
స్టేషన్‌లో ఆగి ఉన్న రైలు.. అదే సమయంలో సిగ్నల్ పడినా అదే ట్రాక్‌పై మరో రైలు దూసుకొచ్చింది. గమనించిన రైల్వే అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్లో ఉన్నప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. స్టేషన్‌లో రైలు ఆగి ఉన్న సమయంలో అదే ట్రాక్‌పై మరో రైలు సిగ్నల్ జంప్ చేసి వేగంగా పట్టాలపైకి దూసుకొచ్చింది. ఇది గమనించిన అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను ఆపి రైలును నిలిపివేయడంతో పెను ప్రమాదం నుంచి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో జరిగింది.
ఈ ఘటన భర్జనా రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. ఢిల్లీ-హౌరా మార్గంలో భర్జనా స్టేషన్‌లో హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆగి ఉంది. ఆ స్టేషన్‌కు సుమారు 5 కిలోమీటర్ల ముందు 507 మైలురాయి వద్ద రెడ్ సిగ్నల్ పడింది. అదే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న శివగంగ ఎక్స్‌ప్రెస్ రైలు లోకోపైలట్లు రెడ్ సిగ్నల్‌ను గమనించకుందా అదే స్పీడుతో రైలును పట్టాలపైకి పోనిచ్చారు. రెడ్ సిగ్నల్ పడినా రైలు ఆగకుండా ముందుకు వెళ్తుంది ఏంటా అని అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేయడంతో రైలు ఆగిపోయింది. అప్పటికే ఆ ట్రైన్ కిలోమీటరు మేర దూసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకున్న అధికారులు : రైలు ఆగడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు అప్రమత్తం కాకుంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ప్రయాణికులు, స్థానికులు వివరిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు లోకోపైలట్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంచు కారణంగా సిగ్నల్ కనిపించకపోయి ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ లోకోపైలట్లు ఎందుకు అప్రమత్తంగా లేరన్న కోణంలో వారిద్దరిపై విచారణ జరుగుతుంది. అనంతరం వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. తప్పు చేసినట్లు తేలితే ఇద్దరు లోకోపైలట్లపైనా చర్యలు తీసుకుంటామని ఉత్తర మధ్య రైల్వే పీఆర్వో అమిత్ సింగ్ అన్నారు. ఇక, ఇప్పటికే దేశంలో అనేక రైలు ప్రమాదాలు సంభవించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications