భార్య ఉండగా, రెండో పెళ్లి వద్దన్నందుకు కన్న తల్లినే చంపిన హెచ్ఎం: కారం చల్లి..

Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. రెండో పెళ్లి వద్దన్నందుకు కన్న తల్లినే హత్య చేశాడు ఓ దుర్మార్గుడు. అతను అందరికీ ఆదర్శంగా నిలవాల్సిన ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఈ దారుణానికి పాల్పడటం గర్హనీయం.
ఈ ఘటన తమిళనాడులోని తంజావూరులో చోటుచేసుకుంది.

ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. తంజావూరులోని శ్రీనివాసపురంలో ప్రభుత్వ పాఠశాలలో కె త్యాగరాజన్‌ (57) ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మొదటి భార్యతో తరచూ గొడవలు ఏర్పడుతుండటంతో ఆమెతో సరిగ్గా మెలిగేవాడు కాదు. దీంతో రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు తల్లి అంగీకరించలేదు.

A man allegedly killed her mother

ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకున్న త్యాగరాజన్.. ఏప్రిల్‌ 20న ఆమె ఒంటి మీద కారం చల్లి, ఆరు సవర్ల నగలు అపహరించి హతమార్చాడు. ఆ తర్వాత ఏమీ ఎరుగన్టలు తల్లి మృతి చెందిందని, నగలు చోరీ అయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. త్యాగరాజన్‌ ప్రవర్తనలో తేడాను గమనించిన ప్రత్యేక పోలీసులు అనుమానంతో మంగళవారం అతడిని విచారించగా అసలు విషయం బయటపడింది. రెండో వివాహానికి తల్లి అంగీకరించకపోవడంతో తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడ్ని బుధవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man allegedly killed her mother for not accepting his second marriage, in Tamil Nadu state.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి