viral video: క్షణాల్లో తప్పించుకున్నారు.. వైరల్ అయిన వీడియో..
మన కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు భయపడిపోతాం. కొందరు ప్రమాదం బారిన పడినప్పుడు చాకచక్యంగా తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఇలా ఓ యువకుడు అత్యంత చాకచక్యంగా ఓ ప్రమాదం నుంచి చిన్నారితో పాటు బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన యూపీలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ లోని మధుర జిల్లా ఓ వ్యక్తి స్కుటర్ పై ఉన్నాడు. అతనితో ఓ చిన్నారి ఉంది. అయితే అక్కడే ఓ భవనం పై నుంచి ఆకస్మాత్తుగా నిర్మాణ వ్యర్థాలు కింద పడుతున్నాయి. ఆ గమనించిన ఆ వ్యక్తి చిన్నారితో పాటు పక్కనున్న దుకాణంలోకి దూకాడు. ఈ దృశ్యాలు దుకాణంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.

సీసీ కెమెరా దృశ్యాలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో వైరల్ అయింది. ప్రమాదాన్ని గమనించిన పలువురు స్థానికులు వారిని రక్షించేందుకు పరుగులు తీశారు. అప్పటికే వారు తప్పించుకున్నారు. ఈ వీడియో చివరి వరకు చూస్తే వారు స్వల్ప గాయాలతో బయటపడినట్లు కనిపిస్తోంది. దుకాణం ముందు దూకిన వారిని దుకాణదారుడు, స్థానికులు వారిని పైకి లేపారు. కూర్చిలో కూర్చోబెట్టారు.
जाको राखे साइयां मार सके न कोय
— Piyush Rai (@Benarasiyaa) July 18, 2022
Visuals from Mathura, UP pic.twitter.com/0o9sneyPhg












Click it and Unblock the Notifications