భార్యకు విడాకులు ఇచ్చాడు. పాప స్కూల్ లో, భార్యను కత్తితో చీల్చేశాడు, ఫ్రెండ్ తో కలిసి !

Posted By:
Subscribe to Oneindia Telugu

మైసూరు: భార్యకు విడాకులు ఇచ్చిన వ్యక్తి అంతటితో కసి తీరకపోవడంతో ఆమెను అతిదారుణంగా హత్య చేసిన ఘటన రాచనగరి మైసూరు నగరంలో జరిగింది. భార్యను అతి కిరాతంగా హత్య చేసిన భర్త కార్తిక్, అతని స్నేహితుడు శీను అనే వ్యక్తిని మైసూరు పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

భార్య ప్రజాప్రతినిధి: ప్రియుడితో బెడ్ రూంలో నగ్నంగా: వీడియో తీసిన భర్త ఏం చేశాడంటే!

కొన్ని సంవత్సరాల క్రితం కార్తీక్, సునీత (29) పెళ్లి జరిగింది. కార్తీక్, సునీత దంపతులకు ఓ పాప ఉంది. అయితే కుటుంబ గొడవల కారణంగా నాలుగు సంవత్సరాల క్రితం ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. మైసూరు నగరంలోని జేపీ నగర్ లో సునీత తన పాపతో కలిసి వేరుగా నివాసం ఉంటోంది.

A man arrested on Monday for allegedly killing his wife in JP Nagar house in Mysuru on June 10.

ఈనెల 10వ తేదీ పాపను స్కూల్ లో విడిచిపెట్టిన సునీత ఇంటికి వచ్చింది. సునీత ఇంటిలో ఉన్న సమయంలో కార్తీక్, అతని స్నేహితుడు శీను ఆమె ఇంటిలోకి దౌర్జన్యంగా వెళ్లారు. తరువాత కత్తి తీసుకున్న కార్తీక్ మాజీ భార్య సునీత గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు.

బెడ్ రూంలోకి పిలిచిన మామ: సర్దుకుపోవాలని భర్త, నా మొగుడితో పడుకో అంటూ అత్త, చివరికి !

సునీత ప్రాణాలు పోయాయని నిర్దారించుకున్న కార్తీక్ స్నేహితుడితో కలసి పరారైనాడు. అప్పటి నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న కార్తీక్, సునీత హత్యకు సహకరించిన అతని స్నేహితుడు శీనును సోమవారం అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని మైసూరు పోలీసులు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man arrested on Monday for allegedly killing his wife in JP Nagar house in Mysuru on June 10.
Please Wait while comments are loading...