Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెంపుడు కుక్క మొరిగిందని.. కుటుంబంపై ఇనుపరాడ్ తో దాడిచేసిన వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్!!

ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క తనను చూసి మెరుగైందని ఓ వ్యక్తి ఐరన్ రాడ్ తో దాడి చేసిన ఘటన ఢిల్లీ వాసులను షాక్ కు గురి చేసింది. కుక్క మొరగటంతో మొదలైన పంచాయితీ అమానుషంగా రాడ్ తో దాడి చేసే దాకా వెళ్ళింది.

కుక్క మొరిగిందని ఇనుప రాడ్ తో దాడి చేసిన వ్యక్తి

కుక్క మొరిగిందని ఇనుప రాడ్ తో దాడి చేసిన వ్యక్తి

ఢిల్లీలోని పశ్చిమ్ విహార్ ప్రాంతంలో తమ పెంపుడు కుక్క మొరిగిందన్న ఆరోపణలతో ముగ్గురు వ్యక్తులపై ఓ వ్యక్తి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. దాడిలో కుక్క కూడా గాయపడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోమవారం సోషల్ మీడియా వేదికగా వైరల్‌గా మారింది. ఈ విషయమై కుక్క యజమాని రక్షిత్ పశ్చిమ్ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

గొడవకు సంబంధించిన వీడియో వైరల్ .. కుక్కపైనా వ్యక్తి దాడి

వైరల్ వీడియోలో, ధరమ్ వీర్ దహియా అనే వ్యక్తి కుక్కను కలిగి ఉన్న పొరుగు కుటుంబానికి చెందిన ముగ్గురిపై ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. అతని యజమానిని ఆ వ్యక్తి కొట్టడం చూసిన కుక్క పరుగు పరుగున వెళ్లి దాడి చేస్తున్న వ్యక్తిని చూసి మొరగడం ప్రారంభించింది . అంతే కాదు అతడిని కరిచింది. దీంతో ఆ వ్యక్తి పెంపుడు కుక్కను సైతం ఇనుప రాడ్‌తో కొట్టడంతో కుక్క కుప్పకూలిపోయింది. పక్కనే ఉన్న వారు ఆపటానికి ప్రయత్నం చేసినా దాడిని ఆపకుండా ఆ వ్యక్తి వీరంగం వేశాడు.

కుక్క మొరిగినందుకు ఇనప రాడ్ తో దాడి చేశారని ఫిర్యాదు చేసిన బాధితులు

కుక్క మొరిగినందుకు ఇనప రాడ్ తో దాడి చేశారని ఫిర్యాదు చేసిన బాధితులు

ఈ ఘటనపై రక్షిత్ మాట్లాడుతూ, తన పొరుగువాడు ధరమ్‌వీర్ దహియా ఉదయం తమ ఇంటి గుండా వెళుతుండగా, ప్రధాన గేటు వద్ద కూర్చున్న తమ పెంపుడు కుక్క తనపై మొరిగిందని చెప్పాడు. దీంతో కోపోద్రిక్తుడైన అతడు ఇనుప రాడ్ తీసుకొచ్చి గేటు వద్ద ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని పేర్కొన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇనుప రాడ్‌తో కుక్కను కూడా కొట్టాడని ఫిర్యాదులో వెల్లడించారు.

పశ్చిమ్ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

పశ్చిమ్ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

కుక్క యజమాని రక్షిత్ వాంగ్మూలం ఆధారంగా పశ్చిమ్ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 308 , 323 , 341 కింద కేసు నమోదు చేయబడింది. జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సెక్షన్ 11తో పాటు ఐపీసీ 451 సెక్షన్ ల పై కూడా కేసు నమోదు చేసినట్టు గా పోలీసులు తెలిపారు. పశ్చిమ విహార్ ఈస్ట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన గొడవకు సంబంధించి పిసిఆర్‌కి కాల్ వచ్చిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (అవుటర్) సమీర్ శర్మ తెలిపారు.

కుక్క అరవటంతో కుక్కను విసిరికొట్టిన వ్యక్తి .. గొడవ షురూ

కుక్క అరవటంతో కుక్కను విసిరికొట్టిన వ్యక్తి .. గొడవ షురూ

పోలీసులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారని, ధరమ్ వీర్ దహియా అనే వ్యక్తి ఉదయం వీధిలో తిరుగుతున్నప్పుడు ఎ బ్లాక్ పశ్చిమ్ విహార్ నివాసికి చెందిన పెంపుడు కుక్క అతనిపై మొరగడం ప్రారంభించిందని గుర్తించారు. ఆ సమయంలో ధరమ్‌వీర్ దహియా కుక్కను తోకతో పైకెత్తి దూరంగా విసిరేశాడని డీసీపీ తెలిపారు. ఇది చూసిన రక్షిత్ వెంటనే జోక్యం చేసుకోవడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వారి మధ్య మాటా మాటా పెరిగింది.

కుక్క కరవటంతో పీక్స్ కు చేరిన గొడవ., ఇనుప రాడ్ తో ముగ్గురిపై దాడి

కుక్క కరవటంతో పీక్స్ కు చేరిన గొడవ., ఇనుప రాడ్ తో ముగ్గురిపై దాడి

ఈ గొడవలో కుక్క దహియాను కరిచింది. కొద్దిసేపటికి ధరమ్‌వీర్ దహియా ఇనుప రాడ్ తో తిరిగి వచ్చి కుక్క తలపై కిరాతకంగా కొట్టినట్లు డీసీపీ తెలిపారు. కుక్కను రక్షించేందుకు ప్రయత్నించిన, గొడవలు ఆపడానికి ప్రయత్నం చేసిన పక్కింటి 53 ఏళ్ల హేమంత్‌పై కూడా నిందితుడు దహియా ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఈ ఘర్షణలో రక్షిత్ తో పాటు కుటుంబ సభ్యులలో ఒకరైన రేణు అలియాస్ యశోద అనే 45 ఏళ్ల మహిళను కూడా నిందితుడు కొట్టాడని డీసీపీ తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+