మద్యం మత్తులో తుపాకీ కాల్పులు జరిపిన కొడుకు: తండ్రి, అతని స్నేహితుడికి గాయాలు

Subscribe to Oneindia Telugu

విశాఖపట్నం: మద్యం మత్తులో ఓ వ్యక్తి అమానుషంగా ప్రవర్తించారు. జిల్లాలోని పాడేరు మండలం కించూరులో మద్యం మత్తులో ఉన్న బాలాజీ అనే వ్యక్తి తన కన్న తండ్రి పోతురాజుపై నాటు తుపాకీతో కాల్పులు జరిపాడు.

అయితే అది గురితప్పి పోతురాజుతోపాటు పక్కనే ఉన్న పోతురాజు స్నేహితుడు సన్యాసినాయుడికి కూడా తూటాలు తగిలాయి. తీవ్రగాయాలపాలైన ఇద్దర్నీ హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

A man fires with a pistol: his father and another man injured

కాగా, నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. అయితే, తన భార్యను దూషించాడనే కారణంగానే తన తండ్రిపై బాలాజీ కాల్పులు జరిపాడని తెలిసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A man fired with a pistol on his father, but few bullets hits another man. The two hospitalized.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X