షాక్:వివాహమైన ప్రియుడితో వివాహేతర సంబంధం కోసం డిమాండ్, ప్రియుడిలా....
ప్రియుడికి మరో యువతితో వివాహమైనా తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని బెదిరించడంతో ప్రియుడు ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకొంది.
చెన్నై:తూత్తుకుడి జిల్లా విలాత్తికుళంలో యువతిని హత్యకు గురైంది. అయితే ఆమెను ప్రియుడే హత్యచేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ హత్యకు గల కారణాలు తెలిస్తే షాక్ గురౌతారు. తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తెచ్చినందుకే ఆమెను చంపేసినట్టు ప్రియుడు పోలీసులకు చెప్పారు.
తూత్తుకుడి జిల్లా ఖిలాత్తికుళం సమీపంలోని సాయర్ పురంలో ముత్తుమారి అనే 21 ఏళ్ల యువతి నివసిస్తోంది.ఆమె చేపల ఎగుమతి కేంద్రంలో పనిచేసేది. అక్కే పనిచేసే తూత్తుకూడి వివేకానంద నగర్ కు చెందిన మహరాజన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది.

ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ళపాటు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. కాని, వారి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ముత్తుమారి ప్రియుడితో సంబంధాలను తెంచుకొంది.
దీంతో మహరాజన్ మరో యువతిని వివాహం చేసుకొని కాపురం చేస్తున్నాడు.ఈ నెల ఎనిమిదవ తేదిన మహరాజన్ కు ముత్తుమారి ఫోన్ చేసి బెదిరించింది. ఇద్దరం కలిసి తీసుకొన్న ఫోటోలను పోలీసులకు చూపి మానభంగం చేసినట్టు ఫిర్యాదు చేస్తానని ఆమె బెదిరించింది.
అంతేకాదు తనతో వివాహేతర సంబంధం పెట్టుకోవాలని ఆమె బెదిరించింది.అంతేకాదు ఉన్నట్టుండి మారిముత్తు తన ప్రేమికుడు మహారాజజన్ ఇంటికి వెళ్ళింది. మహారాజన్ తన భార్యకు మారిముత్తును తాను ప్రేమించిన విషయాన్ని తెలిపారు.
ఆ తర్వాత మారిముత్తును ఆమె ఇంటి వద్ద బైకుపై దింపుతానని భార్యకు చెప్పి వెళ్ళాడు. తన కాపురంలో చిచ్చుపెట్టేందుకుగాను ప్రయత్నిస్తోన్న ఆమెను హతమార్చాలని నిర్ణయం తీసుకొన్నాడు మహరాజన్.
మార్గమధ్యలోనే విత్తికళం తూత్తుకుడి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో పొదలమాటుకు తీసుకెళ్ళి కత్తితో ఆమెను పొడిచి చంపాడు. ఈ నెల 9వ, తేదిన మారిముత్తు శవాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన పోలీసులు మహరాజన్ అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications