జయలలిత కొడనాడు టీ ఎస్టేట్ లో హత్య: కేరళలో అరెస్టు, కుట్ర వెనుక!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు చెందిన కొడనాడు టీ ఎస్టేట్ లో జరిగిన హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు కేరళలో విచారణ ముమ్మరం చేశారు. కేరళలో శుక్రవారం ఓ నిందితుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి ఈ హత్య వెనుక ఎవరెవరు ఉన్నారు అని ఆరా తీస్తున్నారు.

తమిళ తారలను వేధించిన దినకరన్, జనార్దన్, అందుకే నమిత, ఇంధ్ర హీరోయిన్!

కొడనాడు టీ ఎస్టేట్ సెక్యూరిటీ గార్డు ఓం బహుదూర్ ను హత్య చేసిన విషయం తెలిసిందే. కొడనాడు ఎస్టేట్ లో సుమారు 10 మంది దుండగులు చోరబడి ఓం బహుదూర్ ను అతి దారుణంగా హత్య చేసి జయలలిత గదిలో చోరబడి విలువైన పత్రాలు చోరీ చేశారని వెలుగు చూసింది.

A man was arrested in Kodanadu murder case in Kerala by police today.

జయలలిత ఆస్తుల పత్రాలు చోరీ చెయ్యడానకి హత్య జరిగిందని, జయ ఎస్టేట్ లో భారీ మొత్తంలో బ్లాక్ మనీ ఉందని, ఆ నగదు, నగలు లూటీ చెయ్యడానికి హత్య జరిగి ఉంటుందని మీడియాలో వార్తలు వచ్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు.

28 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు: అన్నాడీఎంకేలో మూడో గ్రూప్, తలపట్టుకున్న సీఎం!

కేరళకు వెళ్లిన పోలీసులు జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసుకు సంబంధించి శుక్రవారం ఉదయం ఒకరిని అరెస్టు చేశారు. అతన్ని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. ఆ నిందితుడు తెలిపే వివరాల ఆధారంగా మిగిలిని నిందితులను అరెస్టు చెయ్యాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jayalalithaa: A man was arrested in Kodanadu murder case in Kerala by police today.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి